- Advertisement -

ప‌వ‌న్ అడుగుడు….చంద్ర‌బాబు తీర్చుడు….ఆక్వా, అగ్రిగోల్డ్ భాధితుల స‌మ‌స్య‌లు చూడు సారూ…

- Advertisement -

బాబుకు ప‌వ‌న్ అవ‌స‌రం….ప‌వ‌న్ కు బాబు అవ‌స‌రం ఉంద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం ప్ర‌జా స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించాల‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెల్తే దాన్ని ప‌రిస్క‌రించ‌న దాఖ‌లాలు లేవు. ఒక వేల ప‌రిస్క‌రించినా ఆక్రెడిట్ ప్ర‌తిప‌క్షానికి ద‌క్క‌తుంది… ఆ అవ‌కాశం అధికార ప‌క్షం ఇవ్వ‌రు. కాని ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం దానికి విరుద్దంగా జ‌రుగుతోంది.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికి వ‌చ్చే స‌రికి చంద్ర‌బాబు స‌ర్కార్ వెంట‌నె స్పందించ‌డం చేస్తోంది. ప‌వ‌న్ ఏకోరిక కోరినా స‌రే ప్ర‌భుత్వం వెంట‌నె తీరుస్తుంది. వ్య‌వసాయ శాఖ‌లో ఏవో, ఏయీవో పోస్టుల భ‌ర్తీ నిబంధ‌న‌లు స‌డ‌లిస్తూ ఇచ్చిన జీవో 64ను ప్ర‌భుత్వం ర‌ద్దు చేసింది. ఇదే ఇష్యూపై ఇటీవ‌లే విద్యార్థుల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. తాము చేసిన డిగ్రీల‌కు గుర్తింపు లేకుండా పోతోందంటూ వారంతా ప‌వ‌న్ ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇంకే ముంది వెంట‌నే ప్ర‌భుత్వం స్పందించి.. జీవో 64ను ర‌ద్దు చేసింది. దీంతో ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి ప‌వ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక్కడ, చంద్రబాబు చాలా ‘సెలక్టివ్‌’గానే పవన్‌కళ్యాణ్‌ని మెప్పిస్తున్నారు.. సంతృప్తిపరుస్తున్నారు.

ఇది చిన్న స‌మ‌స్యే. పెద్ద స‌మ‌స్య‌లు చాలానె ఉన్నాయి. అస‌లు విష‌యానికి వ‌స్తె పశ్చిమగోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ రగడకు సంబంధించి పవన్‌ గళం విప్పితే, అసలు చంద్రబాబు సర్కార్‌ పట్టించుకున్న దాఖలాలే లేవు. పోలవరం ప్రాజెక్టు డంపింగ్‌కి సంబంధించి బాధిత రైతులు పవన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. ప‌వ‌న్ ప్ర‌భుత్వానికి లేఖ‌రాశారు. దాన్ని చెత్త బుట్ట‌లో ప‌డేశారు. రాజ‌ధాని భూముల విష‌యాన‌నికి వ‌స్తె అదీ అంతె.

గ‌తంలో అక్వా పుడ్‌పార్క్‌పై స్పందించిన ప‌వ‌న్ కాలుష్య నియంత్ర‌ణ ప్ర‌మాణాల‌కు లోబ‌డే అక్క‌డ ప‌నులు జ‌రుగుతున్నాయ‌నీ, ఈ ద‌శ‌లో మ‌నం అక్క‌డ‌కి వెళ్లి ఆందోళ‌న‌కు దిగితే, ప్రాజెక్టు ప‌నుల్ని అడ్డుకుంటున్నామ‌నే కొత్త పంచాయితీ అవుతుంద‌ని ప‌వ‌న్ అన్నారు. అక్క‌డ పోలీసుల‌ను మోమ‌రించిన సంద‌ర్భాలున్నాయి.

ఇక్క‌డ జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే అర్థ‌మౌతున్న‌ది ఏంటంటే… చంద్ర‌బాబు చాలా సులువుగా ప‌రిష్క‌రించ‌ద‌గ్గ స‌మ‌స్య‌ల్నే ప‌వ‌న్ ఆయ‌న దృష్టికి నేరుగా తీసుకెళ్తున్నారని అనుకోవాలి. ప‌వన్‌తో చంద్రబాబుకి రాజకీయంగా ‘అవసరం’ వుంది. అదే సమయంలో, పవన్‌కళ్యాణ్‌కీ చంద్రబాబుతో రాజకీయ అవసరాలున్నయి అందుకే ఒక‌రి నొక‌రు సంతృప్తి ప‌రుచుకుంటున్నార‌న్న‌మాట‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -