- Advertisement -

పూరీ, చార్మీ మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. బాగోతం బట్టబయలు..

- Advertisement -

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ చార్మీ కౌర్ ల విషయంలో టాలీవుడ్ లో కొత్త రూమర్ వినిపిస్తోంది. ప్రస్తుతం వీళ్లిద్దరూ సహజీవనంలో ఉన్నారని.. ఈ రూమర్ సారాంశం. అయితే గత కొంత కాలంగా పూరి జగన్నాథ్, చార్మీ సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అలాంటిదే మళ్లీ రూమర్ పుట్టుకొచ్చింది. పూరి డైరెక్షన్ లో చార్మీ జ్యోతిలక్ష్మీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది.

ఆ తర్వాత పూరీతో కలిసి నిర్మాతగా పాలు పంచుకుంటోందామె. అలానే పూరీ సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా చార్మీ వ్యవహరించారు. ప్రస్తుతం పూరీ తన తనయుడి హీరోగా పెట్టి రూపొందిస్తున్న ‘మెహబూబా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ముహూర్తం షాట్ దగ్గర నుంచినే చార్మీ కనిపించడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ ఉత్తరభారతదేశంలో కొనసాగుతుండగా.. యూనిట్ తో పాటు చార్మీ కూడా ఉంటోంది. ఇదే టైంలో.. వీరిద్దరి మధ్యనా సమ్‌థింగ్, సమ్‌థింగ్.. అనే మాట ఊపందుకుంటోంది! పూరీ జగన్నాథ్ కి పెళ్లి అయింది. అయినప్పటికి ఇలాంటి రూమర్ వినిపిస్తుండటం విశేషం. పూరీ, చార్మిల సాన్నిహిత్యమే ఇలాంటి పుకారుకి దారి తీస్తోంది.

అయితే ఈ ప్రచారం గురించి పూరీ కానీ, చార్మీ కానీ ఇంకా నోరు విప్పలేదు. తమ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు ఇంత వరకూ. ఈ తరహా ప్రేమకథలు సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. వివాహితులు అయిన దర్శకులను, హీరోలను మళ్లీ పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఆ జాబితాలో చార్మీ కూడా చేరుతుందా? లేక తమది స్నేహం మాత్రమే అని ప్రకటిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -