ఇష్టం లేని వివాహాలు చేస్తే కామ్ గా కూర్చుని కాపురాలు చేసే రోజులు పోయాయి. అమ్మాయిలంతా తెగించేస్తున్నారు. మన దాయాది దేశం… పాకిస్థాన్ లో కూడా అలాంటిదే జరిగింది. అది కూడా ఊహించని దానికంటే ఎక్కువగానే జరిగింది. ఈ వార్త ఇపుడు పాకిస్థాన్ అంతా దావాణంలా వ్యాపించింది. పాకిస్థాన్ కు చెందిన ఆసియా బీబీ అనే యువతి తన ఇంట్లో ఇష్టం లేని మ్యారీజ్ చేయడంతో భర్తను ఏకంగా లేపేయాలనుకుంది.
కానీ విచిత్రంగా ఆమె భర్తతో పాటు ఇంకో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకో 14 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. వీరిలో ఎంతమంది బతుకుతారో లేదో తెలియదు. విషయంలోకి పోతే… ఆసియా బీబీ భర్తని చంపాలని పాలల్లో విషం కలిపి అతనికి ఇచ్చింది. కానీ అతను ఏదో కారణంతో తాగలేదు. ఆ పాలను ఆమె అత్తగారు తీసుకుని తోడు పెట్టి పెరుగు చేసి ఆ తర్వాత లస్సీని చేసింది. ఆమె కుటుంబ సబ్యులు అంతా ఒకటే చోట చేరడంతో అందరికి లస్సిని పంచారు. లస్సి తాగిన కొన్ని నిమిషాలకే 12 మంది అక్కడిక్కడ ప్రాణాలను విడిచారు.
మొదట అంతా లస్సిలో ఏదో బల్లి పడిందేమో అందుకే ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ పోలీసులు మరింత లోతుగా విచారిస్తే…. ఆసియా బీబీ అసలు స్వరూపం బయటపడింది. తనకు నచ్చని పెళ్లిని చేయడం వల్ల తన భర్తను చంపాలని, ప్రియుడి ఆలోచనతో పాలల్లో విషం కలిపాను అని నిజాన్ని ఒప్పుకుంది. చివరకు పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.
