తను ఏదో అద్భుతాలు సృష్టిస్తున్నాను.. అని చెప్పుకోవాలనేది తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయం. తన హయాంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి జరుగుతోంది..
అది కూడా బ్రహ్మాండైమన అభివృద్ధి.. తను నేతగా ఉన్నందున ఏపీకి కొత్తగా పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి.. అని బాబు చెప్పుకోదలిచాడు. అయితే ఇలా చెప్పుకోవడంలో చంద్రబాబు మరీ దిగజారుతున్నారేమో.. జనాలకు భ్రమలను కలిగించడంలో ఆయన మరీ అతి చేస్తున్నాడేమో అనే అభిప్రాయాలు కలుగుతున్నాయిప్పుడు.
జరుగుతున్న పరిణామాలే ఈ అభిప్రాయాలకు కారణం. ఉదాహరణకు చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీ సెజ్ లో పెప్సీకో యూనిట్ ను ప్రారంభించారు. పెప్సీ ఇండియా విభాగం చైర్మన్ ఇంద్రనూయి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె పక్కన నిలబడి బాబు పోజులిచ్చారు. చూడండి.. నా సత్తా అన్నట్టుగా మాట్లాడారు!
అయితే శ్రీ సిటీ సెజ్ లోని పెప్సీ కో యూనిట్ కొత్తగా బాబు హయాంలో వచ్చింది కాదు.. అది ఉమ్మడి రాష్ట్రం లోనే ప్రతిపాదించబడింది. ఇంకా చెప్పాలంటే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ యూనిట్ కు బీజం పడింది. 2013 డిసెంబర్ 21న కిరణ్ చేత పెప్సీ కో యూనిట్ ప్రారంభం అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ దాన్నే ప్రారంభించాడు!
దీని ద్వారా ప్రచారం పొందే యావ ఆయనది. తన ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యిందని చెప్పుకోవడానికి బాబు ఇలా తాపత్రయ పడ్డారు. ఇలా అడ్డంగా బుక్కయ్యారు. మరి తెలుగుదేశం అధ్యక్షుడికి ఇదేం ఆనందమో!
