వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చెక్ పెట్టేందుకు అలనాటి వాణి విశ్వనాధ్‌ను టీడీపీ ఆహ్వానిస్తున్న సంగతితెలిసిందే. గతంలోకూడా పార్టీలో చేరనున్నట్లు ఆమె ప్రకటించింది. రాజకీయాల్లో పూర్తి స్థాయిలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె వెల్లడించారు. చంద్రబాబు ఆదేశిస్తే రోజాపై పోటీకి సిద్దంగా ఉన్నట్టు వివరించారు. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా తీస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రంలో నటించేందుకు తాను సిద్దమన్నారు.
గతంలో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన వాణీవిశ్వనాథ్ ఇటీవల పెద్దగా నటించడం లేదు. దీంతో ఆమె రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే రోజాను ఎదుర్కొంనేందుకు వాణివిశ్వనాథ్‌ను రంగంలోకి దింపాలని భావించిన టీడీపీ కొద్దికాలంగా ఆమెకు గాలం వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి వాణీని పోటీకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది.
ఎట్టకేలకు వాణివిశ్వనాధ్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. విజయవాడ వచ్చిన ఆమె ఇవాల ఇంద్రకీలాద్రిలో కనకదుర్గను దర్శించుకున్నారు. విజయవాడలో రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుస్తానని చెప్పారు. అలాగే పార్టీలో చేరతానని తెలిపారు. దక్షిణాది సినిమాల్లోనే కాక ఆమె బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
