- Advertisement -

హైద‌రాబాద్‌లో 28న మొహ‌బూబా ప‌ర్య‌ట‌న‌

- Advertisement -

కొత్త రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా తెలంగాణ పేరు మార్మోగుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు, అధికారులు తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు తెలుసుకుని త‌మ రాష్ట్రంలో అమ‌లు చేయాల‌ని ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. కొత్త కొత్త ప‌థ‌కాలు, విభిన్న కార్య‌క్ర‌మాల‌తో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు దేశంపైన ఉన్న, హిమాల‌యాల‌కు పెట్టింది పేరుగా నిలుస్తున్న జ‌మ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సయిద్ ప‌ర్య‌టించ‌నున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పర్యటన ఖార‌ర‌య్యింది. డిసెంబ‌ర్ 28వ తేదీన జమ్మూ కశ్మీర్ ప‌ర్యాట‌కాన్ని ప్ర‌చారం చేయాల‌నే ఆలోచ‌న‌లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆమె భేటీ కానున్నారు. హైద‌రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో కలిసి మెహబూబా ముప్తీ భోజ‌నం చేసే అవకాశం ఉంది. ఆమె కోసం ఐటీసీ షెర్టన్ గ్రాండ్ కాకతీయలో బస ఏర్పాటు చేస్తున్నారు. మొహ‌బూబా డిసెంబ‌ర్ 29వ తేదీన హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు తిరుగు ప్రయాణం అవ‌తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -