- Advertisement -

వ్యాపారానికి భార‌త్‌లో అద్భుత‌మై అవ‌కాశాలున్నాయి..దావోస్‌లో మోదీ

- Advertisement -

భార‌త్‌లో వ్యాపార అభివృద్దికి అపార‌మైన అవ‌కాశాలు ఉన్నాయ‌ని ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ప్రముఖ సీఈఓలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత అభివృద్ధి గురించి, వ్యాపార అవకాశాల గురించి వివరించారు.

20 ఏళ్ల తరువాత ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి. మానవ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం మనందరి ముందున్న సవాల్ అని అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో పయనించేలా ఈ సదస్సు దోహదపడుతుందని చెప్పారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

గడచిన రెండు దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మోదీ అన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి జరిగి, ఇంటర్నెట్, బిగ్ డేటాలతో ప్రపంచమంతా అనుసంధానమవుతోందని అన్నారు. మన మాట, పని అన్ని విషయాలను సాంకేతికత ప్రభావితం చేస్తోందని చెప్పారు. 1997లో భారత ప్రధాని దావోస్ వచ్చారని, అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ 400 బిలియన్ డాలర్లుగా ఉండేదని తెలిపారు. ఇప్పుడు దాదాపు ఆరు రెట్లు పెరిగిందని అన్నారు.

ప్రపంచాన్ని పర్యావరణ మార్పులు భయపెడుతున్నాయని, కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడం దీనికి ఓ పరిష్కారమని సూచించారు. ప్రకృతితో మమేకమవడం భారత్‌ విధానమని చెప్పుకొచ్చారు. అవసరమైనంత వరకే దాచుకోవడం భారతీయుల విధానమన్నారు. మానవ శక్తిపై తనకు అపార నమ్మకముందని, సైబర్‌ సెక్యూరిటీ, అణు భద్రతలపై ప్రపంచం దృష్టి సారించాలన్నారు. 2022 నాటికి 170 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ సామర్ధ్యాన్ని సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -