- Advertisement -

కేసీఆర్ కు చావు భయం ఏర్పడిందా…!

- Advertisement -

తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి మరో సంచలన ఆరోపణ చేశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడుతూ తన దైన శైలిలో స్పందించాడు రేవంత్ రెడ్డి. ప్రత్యేకించి కేసీఆర్ చేయదలిచిన చండీయాగం గురించి రేవంత్ స్పందించాడు.

కేసీఆర్ చండీయాగం చేయడం గురించి రేవంత్ స్పందిస్తూ… ఇది కేవలం కేసీఆర్ మృత్యుభయంతోనే చండీయాగం అంటున్నాడని అన్నాడు. మరణభయంతోనే కేసీఆర్ ఆ యాగం చేయిస్తున్నాడని.. రేవంత్ రెడ్డి ఆరోపించాడు. 

మరి తెలంగాణ ముఖ్యమంత్రికి చావు భయం మొదలైందని ప్రతిపక్ష నేత మాట్లాడటం ఆసక్తికరమైన అంశమే. ఒకవైపు ఈ చండీయాగానికి ఎవరెవరవస్తారు? ప్రధానమంత్రి నరేంద్రమోడీ హాజరవుతారా… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ యాగానికి హాజరై భాగస్వాముడవుతాడా.. అనే అంశాల గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

మరి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యానించడం విశేషమే. తెలంగాణ ముఖ్యమంత్రికి మృత్యుభయం పెరిగిందని.. అందుకే ఇలాంటి యాగాన్ని చేస్తున్నాడని రేవంత్ అంటున్నాడు. మరి ఈ యాగానికి తమ పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతాడో.. లేదో..కూడా రేవంత్ చెబితే బాగుంటుంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -