Tuesday, May 7, 2024
- Advertisement -

రాజ్యసభ సీటు ఇవ్వకపోతే ‘నిప్పు’ నిజస్వరూపం బయటపెట్టేస్తా అంటున్న టిడిపి ఎంపి

- Advertisement -

‘నేను నిప్పు’ అని రెగ్యులర్‌గా చెప్పుకునే ఒక నాయకుడికి ఇప్పుడు మామూలు కష్టాలు రావడం లేదు. 2014 ఎన్నికల సమయంలో ఆర్థికంగా బలమైన అండగా నిలబడి……నిప్పు వారి అక్రమ వ్యవహారాలన్నీ చక్కబెట్టిన నిప్పు పార్టీ రాజ్యసభ సభ్యుడు ఒకరు నిప్పును బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా వాడేసుకుని…….ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అనే ధైర్యంతో కరివేపాకులా పక్కన పడేస్తాను అంటే పడి ఉండడానికి నేను నందమూరి వారసుడిని కాదు. ఆర్థికంగానూ, రాజకీయంగానూ నా బలాలు నాకు ఉన్నాయి. తేడా వస్తే ప్రతిపక్ష పార్టీలో చేరి నిప్పు వారి పార్టీని నిండా ముంచెయ్యగలను. రాజ్యసభ సీటు ఇవ్వకపోతే నరేంద్రమోడీని కలిసి పదేళ్ళుగా నిప్పువారి రాజకీయ రహస్య పొత్తులు, అక్రమాలు, ఒక మహానేత మరణం తాలూకూ అసలు రహస్యాలు అన్నీ మోడీకి చెప్పగలను అని ఆ నిప్పు పార్టీ రాజ్యసభ ఎంపి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట.

రీసెంట్‌గా ఆన్లైన్‌లో ఆది నారాయణరెడ్డితో అవినీతి పంపకాల వ్యవహారం గురించి నిప్పు నాయకుడు హితోపదేశం చేసిన వీడియో వెనకాల కూడా ఆ టిడిపి రాజ్యసభ సభ్యుడే ఉన్నాడని టిడిపి నేతలే చర్చించుకుంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు నుంచీ…….ఎన్నికల వరకూ కూడా నిప్పు నాయకుడి కోసం కొన్ని వేల కోట్లు ఖర్చుపెట్టిన ఆ ఎంపీ ఇప్పుడు పూర్తిగా రివర్స్ అవుతున్నాడట. నిప్పు నాయకుడికి అస్సలు కృతజ్ఙత లేదని చెప్తున్నాడట. నిప్పునే నమ్ముకుని ఉండడానికి నేనేమీ ప్రజాబలంతో రాజకీయాల్లోకి రాలేదని……ఆర్థిక బలం, పై స్థాయిలో పలుకుబడితో వచ్చానని…….రాజ్యసభ సీటు ఇచ్చారా…..ఒకే….తేడా వస్తే మాత్రం ప్రతిపక్ష పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో టిడిపిని గల్లంతు చేస్తా. లేకపోతే మోడీని కలిస మహానేత మరణ రహస్యాలు, ఓటుకు కోట్లు అసలు నిజాలన్నీ చెప్పేస్తానని ఆ టిడిపి ఎంపి నిప్పు నాయకుడిని డైరెక్ట్‌గానే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. 2019 తర్వాత ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తానని నిప్పువారు ఆఫర్ చేసినప్పటికీ…….తనకు నమ్మకం లేదని చెప్పాడట సదరు ఎంపి. ఇప్పుడు ఆ ఎంపిని బుజ్జగించడానికి టిడిపి భజన మీడియా అధినేత, బూతు ఛానల్ ఎండి రంగంలోకి దిగాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఆ టిడిపి ఎంపికి రాజ్యసభ సీటు ఇవ్వడమే నిప్పు నాయకుడికి మంచిదని……..ప్రతిపక్షంలో ఉన్నప్పటినుంచీ నిప్పు కోసం వేల కోట్లు ఖర్చుపెట్టడంతో పాటు…….ఓటుకు కోట్లుతో సహా ఎన్నో కొనుగోలు వ్యవహారాలు, లాబీయింగ్ వ్యవహారాలు నిప్పు తరపున చక్కబెట్టిన ఆ నాయకుడిని కరివేపాకులా వాడుకుని వదిలేస్తే మాత్రం …..ఆ నాయకుడు తిరగబడితే నిప్పు వారి తుప్పు పట్టిన చరిత్ర మొత్తం ప్రజలకు సాంతం తెలిసిపోవడం……ఆ తర్వాత నిప్పుకు కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కకుండా పోవడం…..ఇంకా తేడా వస్తే ఊచలు లెక్కపెట్టాల్సిన అవసరం కూడా వచ్చే అవకాశం ఉందని టిడిపి నేతలే అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -