జగన్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకోని మరో మైలురాయి దాటింది. నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభించిన దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే 1350 కి.మీ. పైగా సాగిన జగన్ పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. అయితే రెండు రోజులపాటు పాదయాత్రకు బ్రేక్ పడనుందని పార్టీ వర్గాల సమాచారం.
ప్రత్యేకహోదా విషయంలో జగన్ మరింత దూకుడుగా వెల్తున్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెడతామని వరుస ప్రకటనలు చేస్తూ రాష్ట్ర,దేశరాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. ముఖ్యంగా ప్రత్యేకహోదా కోసం అవసరమైతే ఎంపీల రాజీనామాకి కూడా సిద్ధమని.. రాజీనామా డేట్‌తో సహా డెడ్‌లైన్ జగన్ ప్రకటించడంతో రాజకీయాలు వేడెక్కాయి.
ప్రత్యేక హోదా సాధనకోసం మార్చి 1న 13 జిల్లాల కలెక్టరేట్లను ముట్టడించనున్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రకటించారు. మార్చి 5న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా చేపట్టనుంది. కలెక్టరేట్ల ముట్టడి పిలుపు నేపథ్యంలో జగన్ గురువారం పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో కలసి వైసీపీ శ్రేణులుకూడా పాల్గొననున్నాయి. మరో మైపు పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాల్లో పాల్గొనేందుకుగాను మార్చి 3న వైసీపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఎలాగూ ప్రతిశుక్రవారం జగన్ సీబీఐ కోర్టుకు హజరవుతున్న సంగతి తెలసిందే.
