నటీనటులు భారీగా ఉండి.. కథ సూపర్‌గా ఉంటే ఇక ఆ సినిమా బిజినెస్‌ను మాత్రం పక్కాగా చేసుకుంటే మాత్రం పెట్టిన పెట్టుబడి డబులు, త్రిబుల్ వస్తుంటుంది. ఆ లెక్కన బిజినెస్ చేసుకుంటే మాత్రం సినీ రికార్డులను తిరగరాయవచ్చు. ఈ లాజిక్కును దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి బాగా వాడేసుకుంటాడు. తాను చేసిన సినిమాకు బిజినెస్‌ను పక్కాగా చేసుకొని బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించేసుకుంటున్నాడు.
సినిమాను వ్యాపారంగా మలుచుకొని జక్కన్న ఆ విధంగా లాభాలు కూడా పొందుతున్నాడు. బాహుబలి రెండో సినిమాకైతే భారీస్థాయిలో దేశమంతటా బాహుబలి నామసర్మణ మోగేలా చేశాడు. సినిమా తీయడమే కాదు దాన్ని బాగా టాక్టిక్‌గా తెరకెక్కిస్తే సినిమా అంతగా ఆడే అవకాశం ఉంది. అందుకే రాజమౌళి రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో తీసే భారీ మల్టీస్టారర్ సినిమా కోసం ఇప్పటి నుంచే బిజినెస్ పనులు రాజమౌళి ప్రారంభించాడు.
బాహుబలి సినిమా సమయంలోనే ముంబాయిలోని ఓ సంస్థతో డీల్ కుదుర్చుకున్న రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాను అతడితో కలిసి ఎన్టీఆర్, రామ్‌చరణ్ సినిమాను బాగా క్యాష్ చేసుకునేలా రాజమౌళి ప్లాన్ వేశాడు. బాహుబలి సినిమా కోసం ముంబాయిలోని మార్చింగ్ యాంట్స్ అనే సంస్థతో డీల్ కుదుర్చుకున్నాడు. ఆ డీల్ బాగా కలిసిరావడంతో ఇప్పుడు ఈ సినిమాను కూడా అదే సంస్థతో ఈ సినిమా వాణిజ్య కార్యక్రమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.
ఆ సంస్థనే ఇటీవల రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ను లాస్ ఏంజెల్స్‌లో ఫొటో షూట్‌కు తీసుకెళ్లారని సమాచారం. అంటే సినిమా షూటింగ్ మొదలుపెట్టేముందే ప్రచార కార్యక్రమాలపై రాజమౌళి సిద్ధమవుతున్నాడంటే మరీ ఈ సినిమా ఏ రేంజ్లో విడుదల చేయాలని చూస్తున్నాడో తెలుస్తోంది.
