వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తనపై జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని చెప్పారు. తనపై జగన్ చేస్తున్న ఆరోపనలు నిరూపిస్తే రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానని లేకపోతే వైసీపీనీ పూర్తిగా మూసేస్తారాని సవాల్ విసిరారు .
జర్నలిస్టులను హత్య చేయించేంత నీచమైన సంస్కృతి తనది కాదని అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, వేల ఎకరాల భూమిని దోచుకున్న ఘనత జగన్ దని ఆరోపించారు. ఇద్దరం రాజీనామా చేసి చిలకలూరిపేట నుంచి పోటీ చేద్దామని… జగన్ కు కనీసం డిపాజిట్ కూడా దక్కదని అన్నారు.
చిలకలూరి పేట నియోజక వర్గంలో జరుగుతున్న పాదయాత్రలో నిర్వహించిన బహిరంగసభలో జగన్ ప్రత్తిపాటి పుల్లారావు చేసిన అవినీతి, అక్రమాలు చేశారని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో జరగుతున్నఅవినీతి, అక్రమాలు, దారుణాలు, వేధింపులు అన్నింటిలో చిలకలూరిపేట మొదటి స్థానంలో ఉందని ఆరోపనలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గం, గుంటూరు జిల్లాలు నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులకు అడ్డగా మారాయి. సాక్షాత్తు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇందులో భాగం ఉందని జగన్ విమర్శలు చేశారు. మరి మంత్రి సవాల్‌పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
