Sunday, May 5, 2024
- Advertisement -

చంద్రబాబుకు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు…

- Advertisement -

నిను వీడ‌ని నేనే అంటూ చంద్రబాబునాయుడును వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వదిలిపెట్టేలా లేరు. బోనులో నిలబెతానని చేసిన సవాలును ఆచరణలోకి తెచ్చేట్లే కనబడుతోంది. తాజాగా సిఎంకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని వియసాయిరెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం నేరగాళ్లకు అడ్డాగా మారిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎం విజ‌య‌సాయి మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రిని కించపరిచేలా, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాని కార్యాలయాన్ని నేరస్తుల అడ్డాగా అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో సభా హక్కుల ఉల్లంఘనకు చంద్రబాబు పాల్పడ్డారని చెప్పారు.

ప్రధానిని కలిసే హక్కు ప్రతి ఎంపీకి ఉంటుందని… ఇంకా చెప్పాలంటే దేశంలోని ఏ పౌరుడికైనా ప్రధానిని కలిసే అవకాశం ఉంటుందని, పీఎం అపాయింట్ మెంట్ ను ఎవరైనా అడగవచ్చని తెలిపారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ, నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు.

చంద్రబాబుకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాలని, అతని నుంచి వివరణ కోరాలని విజయసాయి అన్నారు. చట్ట ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలనేది తన అభిప్రాయమని చెప్పారు. మోదీకి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -