- Advertisement -

తెలంగాణాలో న‌గ‌దు కొర‌త‌పై జైట్లీ చేసిన ట్విట్‌కు కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్‌

- Advertisement -

బ్యాంకుల్లో నగదు నిల్వల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో సరిపడినంత నగదు చలామణిలో ఉందని, బ్యాంకుల వద్ద అందుబాటులో ఉందంటూ మంగళవారం జైట్లీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. జైట్లీ ట్వీట్‌కు కౌంట‌ర్ ఇచ్చారు తెలంగాణా ఐటీ మ‌త్రి కేటీఆర్‌.

బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగానో లేక తాత్కాలికంగానో రాలేదని, ఈ విషయమై మూడు నెలలుగా హైదరాబాద్‌లో తరుచూ ఫిర్యాదులు వచ్చాయని ట్వీట్ చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని క్రమంగా వమ్ము చేస్తోన్న సమస్యపై ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ లోతుగా పరిశీలించాలని ఆయన అన్నారు. నగదు కొరతపై ఏఎన్ఐ ట్వీట్‌ను రీ ట్వీట్ చేసిన కేటీఆర్ అరుణ్ జైట్లీ చెప్పిన దానికి ఇది ఉదాహరణ అంటూ కామెంట్ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -