వీరేంద్ర సెహ్వాగ్ ఎంతటి విధ్వంసకర బ్యాట్స్‌మనో.. అంతే వైవిధ్యమైన వ్యక్తిత్వం ఉన్న గొప్ప వ్యక్తి. సోషియల్ మీడియాలో వీరేంద్రుడు ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలే కాకుండా సామాజిక అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ.. ట్విటర్లో పోస్టులు పెడుతుంటాడు.
తాజాగా అలాంటి పోస్ట్ పెట్టి అభిమానుల గుండెల్ని పిండేశారు. తన వీరాభిమాని పాదాలకు వందనం చేసిన వీరేంద్రుడు.. ఆయనకు అరుదైన గౌరవం కల్పించి తన గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసుకున్నాడు. పాటియాలకు చెందిన 93 ఏళ్ల ఓం ప్రకాశ్ అనే వృద్ధుడు సెహ్వాగ్‌కు వీరాభిమాని. ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సెహ్వాగ్ మెంటార్‌గా ఉన్న విషయం తెలిసిందే. చంఢీగఢ్‌లో మంగళవారం (ఏప్రిల్ 18) ఆ జట్టు సభ్యులు ప్రాక్టీస్ చేస్తుండగా.. సెహ్వాగ్ పర్యవేక్షించాడు. ఈ సమయంలో ఓం ప్రకాశ్ తన అభిమాన క్రికెటర్ వీరేంద్రుణ్ని కలుసుకున్నారు.
ఓం ప్రకాశ్‌ను ఆప్యాయంగా పలకరించిన సెహ్వాగ్.. పెద్దల పట్ల తనకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కాళ్లు మొక్కాడు. ఆయన అభిమానానికి ఆవిధంగా ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘దాదా కో ప్రణామ్’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Felt extremely touched on meeting Om Prakash ji, who is 93 years old and came from Patiala to meet me in Chandigarh and expressed his love for me. Dada ko Pranam. pic.twitter.com/8AHHqNl753
— Virender Sehwag (@virendersehwag) April 17, 2018
