Sunday, May 5, 2024
- Advertisement -

టీ మిండియా కోచ్ రేసులో న్యూజిలాండ్ మాజీ కోచ్ …

- Advertisement -

టీమిండియా కోచ్ ప‌ద‌వికి పోటీ పెరుగోతంది. అనేక మంది స్వ‌దేశీ, విదేశీ ఆట‌గాళ్లు కోచ్ ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. ప్రధాన కోచ్ రవిశాస్త్రి, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్‌ల పదవీకాలం ప్రపంచకప్‌తో ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. కోచ్ రేసులో గ్యారీ క్రిస్టెన్‌, మ‌హేల జ‌య‌వ‌ర్ధ‌నె, టామ్‌మూడీ త‌దిత‌రులు ప్రదాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసినట్టు స‌మాచారం.

ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి దరఖాస్తు చేయకుండానే నేరుగా ఇంటర్వ్యూకు వచ్చే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. దీంతో మొత్తం న‌లుగురు కోచ్ రేసులో ఉన్నారు.తాజాగా మరో దిగ్గజ కోచ్‌ టీమిండియా ప్రధాన కోచ్‌పై ఆసక్తి కనబరుస్తున్నట్టు స‌మాచారం. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెస్సన్‌ కూడా భారత్‌ ప్రధాన కోచ్‌ కోసం దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం.ఆరేళ్లుగా కివీస్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు సేవలందించాడు. దాంతో పాటు ఈయ‌న కోచ్ నేతృత్వంలొనె 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ ఫైన‌ల్‌కు వెల్లింది. ఇక ఐపీఎల్‌లో కింగ్స్‌ పంజాబ్‌కు సేవలందించ‌డంతో భార‌త్ ఆట‌గాళ్ల ప‌రిస్థితి, ఇక్క‌డి ప‌రిస్థితుల‌పై అవ‌గాహ‌న ఉండ‌టం క‌ల‌సి వ‌చ్చే అంశం. టీమిండియా ప్రధాన కోచ్‌ నియామక ప్రక్రియ బాధ్యతను చేపట్టిన దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్, శాంత రంగస్వామిలతో కూడిన తాత్కాలిక క్రికెట్‌ సలహా కమిటీని నియ‌మించింది బీసీసీఐ. కోచ్‌గా ఎవ‌రిని సెల‌క్ట్ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -