స్మార్ట్‌ఫోన్ వచ్చిన తరువాత కొందరి జీవితాలు మారిపోతున్నాయి. మనుషుల కన్నా ఫోన్స్‌కే ఎక్కువ ప్రాధన్యత ఇస్తున రోజులు ఇవి.స్మార్ట్‌ఫోన్ వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు కూడా అంత కన్నా ఎక్కువ ఉన్నాయి.ఫోన్ చాలామంది జీవితాలను నాశనం చేస్తుంది.వైవహిక జీవితాలు పాడువుతున్నాయి.దీనికి సెలబ్రెటీలు ఏమి మినహాయింపు కాదు. తాజాగా దీనిపై మెగా హీరో రాంచరణ్ స్పందించారు.అయితే ఇది వేరే ఉద్దేశంతో కాదులేండీ. రామ్ చరణ్ అప్పుడప్పుడు తన భార్య ఉపాసన మొబైల్ చెక్ చేస్తుంటాడట.
ఈ విషయాన్ని అతడే బయటపెట్టాడు. “సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్స్, వాళ్ల ఫీలింగ్స్ తెలుసుకుంటాను. ఎలా అంటే, అప్పుడప్పుడు మా ఆవిడ ఫోన్ చెక్ చేస్తుంటా. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను నేను ఓపెన్ చేస్తాను. ఆమె పెట్టిన పోస్టులు అలా అలా చూస్తుంటాను. నాకు సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే చదువుతాను. అలా సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్ ఫీలింగ్స్ నేను తెలుసుకుంటాను.అని చెప్పుకొచ్చాడు చరణ్.
