- Advertisement -

అభిమాని మృతిపై అల్లు అర్జున్

- Advertisement -

హీరోలు ఇంత పెద్ద స్టార్‌డ‌మ్ సాధించటానికి కార‌ణం వారి ఫ్యాన్స్‌. ఈ విష‌యంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విష‌యాన్ని హీరోలు కూడా గుర్తించారు.హీరోలు త‌మ ఫ్యాన్స్‌కు ఎవ‌రికైనా ఆరోగ్యం బాలేక‌పోతే హీరోలు త‌మ అభిమానుల దగ్గ‌రకు వెళ్లి వారి వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌ను తెలుసుకుని కొంత ఆర్ధిక స‌హాయం చేసి వ‌స్తారు. ఈ విష‌యంలో టాలీవుడ్ హీరోలు ముందు వ‌రుసలో ఉంటారు.

మ‌హేష్,ఎన్టీఆర్‌,రాంచ‌ర‌ణ్‌,అల్లు అర్జున్ లాంటి వారు ఆరోగ్యం బాలేని వారి ఫ్యాన్స్‌ని క‌లుసుకుని వారి క‌ళ్ల‌లో ఆనందాన్ని చూశారు. అనకాపల్లికి చెందిన దేవ్ సాయి గణేష్ అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్‌.బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న గణేష్ తనకు బన్నీని చూడాలని ఉందని, అదే తన చివరి కోరిక అని కుటుంబసభ్యులకు చెప్పాడు. దీంతో గణేష్ సోదరుడు సోషల్ మీడియా ద్వారా అల్లు అర్జున్ పీఆర్వోను సంప్రదించారు. అలా విషయం బన్నీకి చేరింది. దీంతో వారం రోజుల క్రితం అంటే గత శనివారం నేరుగా అనకాపల్లి వెళ్లిన బన్నీ.. 17 ఏళ్ల గణేష్‌ను కలిసి ధైర్యం చెప్పారు.

వైద్య ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షల ఆర్థికసాయం కూడా చేశారు. బన్నీ కోరిక ఫలించలేదు. ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం గణేష్ చనిపోయాడు.వారం రోజుల క్రితమే తాను పరామర్శించి వచ్చిన అభిమాని ఇకలేడనే వార్తను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మేరకు ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ‘సాయి గణేష్ ఆత్మకు శాంతి చేకూరాలి అని త‌న ఆవేదన వ్యక్తం చేశాడు బ‌న్నీ.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -