- Advertisement -

సంచలనం సృష్టించిన చిన్నారి దీక్ష విరమణ!

- Advertisement -

‘‘ఇది నా ఓటమి కాదు. నా పోరాటం కోర్టులో కొనసాగుతుంది. స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ మాకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు’’ అని ఆరేళ్ల బుడతడు ఆదిత్యకుమార్‌ ధైర్యంగా ప్రకటించాడు. తన తల్లిదండ్రులపై పోలీసులు ప్రదర్శించిన దురాగతానికి వ్యతిరేకంగా ఆదిత్య పట్నాలోని గర్దనీబాగ్‌లో నిరసన దీక్ష చేపట్టాడు. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ దీక్షను ఆయన సోమవారం రాత్రి అధికారికంగా విరమించాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రుల కోసం, పోలీసుల వేధింపులపై ఒంటరి పోరాటం చేసిన ఆదిత్యకుమార్‌ ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఆగస్టు నెల చివరివారంలో బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (BPSC) పరీక్ష అభ్యర్థులతో కలిసి ఆదిత్య ఒక భారీ ఆందోళనలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆయన చేసిన పదునైన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన అద్భుతమైన మాటలతో ఆ బాలుడు ఇంటర్నెట్ సంచలనంగా మారాడు. చిన్న వయస్సులోనే ప్రజా సమస్యలపై గళం వినిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ నిరసన శిబిరానికి స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌ స్వయంగా వచ్చి ఆదిత్యను కలిశారు. పోలీసుల దాడికి సంబంధించిన పూర్తి విషయాన్ని తాను స్వయంగా కోర్టు దృష్టికి తీసుకువెళతానని బాలుడికి భరోసా ఇచ్చారు. పప్పూ యాదవ్‌ మాటలపై పూర్తి నమ్మకంతో ఆదిత్య తన దీక్షను విరమించాడు.

ఈ సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడాడు. పప్పూ యాదవ్‌ను ఆయన ‘పేదల రక్షకుడిగా’ అభివర్ణించాడు. ఆయన తన తండ్రిలాంటి వాడని కొనియాడాడు. తన కష్టకాలంలో తనకు మంచి పాఠశాలలో ఉచితంగా ప్రవేశం లభించేలా పప్పూ యాదవ్ ఎంతో సాయం చేశారని గుర్తుచేసుకున్నాడు. అందుకే ఆయన ఇచ్చిన మాట మేరకు, ఆయన కోరికపైనే తాను ఈ ధర్నాను విరమిస్తున్నట్లు స్పష్టం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -