వైఎస్ జగన్ 2019లో జరిగే ఎలెక్షన్స్‌లో ఎట్టి పరిస్థితులలో సీఎం కావాలనే పట్టుదలతో, ఎండ వానలను లెక్కచేయకుండా నిత్యం ప్రజలలో తిరుగుతున్నాడు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజలలోకి తీసుకువెళ్తు పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నాడు జగన్. ప్రజలు కూడా జగన్‌పై సానుభూతితో ఉన్నారు. కొన్ని ఎలెక్షన్స్ సర్వేలు కూడా వైసీపీకి అనుకులంగా ఉన్నాయి.
మరి ఇటువంటి పరిస్థితులలో జగన్ చారిత్మ్రాక తప్పు చేస్తున్నాడని అంటున్నారు రాజకీయ విశ్లేషుకులు. కేంద్ర ప్రభుత్వం కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మాట తప్పింది. దీనిపై జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంది. ఇక ఇప్పటికే టీడీపీ పార్టీ ఈ సమస్యపై పోరాటం చేస్తుంది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేత సీయం రమేష్ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. మరి జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని చెప్పి మాట తప్పిన కేంద్ర ప్రభుత్వంపై, జగన్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. పైగా టీడీపీ దీనిపై అనేక పోరాటాలు చేస్తు జనాలలో సాఫ్ట్ కార్నర్ కొట్టేసింది.
జగన్ పాదయాత్రలో ఉన్నాడని కడప జిల్లా వైసీపీ నాయకులు కూడా దీనిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదో తుతుమంత్రంగా ధర్నాలు చేస్తున్నారు. వైసీపీ గట్టిగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిచడం లేదు. దీనిని సాక్ష్యంగా చూపిస్తు ,వైసీపీ,బీజేపీ రెండు ఒక్కటే అని టీడీపీ విమర్శలు చేస్తుంది. దీనిలో భాగంగానే జగన్ కడప ఫ్యాక్టరీ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదని టీడీపీ ఆరోపిస్తుంది. మరి సమస్య నుండి వైసీపీ ఎలా బయట పడుతుందో చూడాలి.
