భారతీయ జనతా పార్టీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు, శాసనసభలో బిజెపి పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ నియమితులయ్యారు. పూర్వ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పదవీకాలం ముగియడంతో లక్ష్మణ్ ను అధ్యక్షుడిగ నియమించారు.
బిసి వర్గానికి చెందిన లక్ష్మణ్ కు వివాదాస్పద నాయకుడిగా పేరుంది. తెలంగాణాలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అందరితో కలిసి పనిచేస్తానని ఆయన అన్నారు. పార్టీ మాజీ అధ్యక్షుల సలహాలు తీసుకుంటానని లక్ష్మణ్ చెప్పారు.
కర్నాటక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా యడ్యూరప్పను నియమించారు. ఇంతకు ముందు కూడా ఆయనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ పార్టీ అధ్యక్షుడిగా ఒబిసి నేత కేశవ్ ప్రసాద్ మౌర్య, పంజాబ్ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి విజయ్ సాంప్లా, అరుణాచల్ ప్రదేశ్ అధ్యక్షుడిగా తపిర్ గావ్ లను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది.
