- Advertisement -

అర‌కు ఘ‌ట‌న పోలీసుల వైఫ‌ల్య‌మే..డీజీపీ ఆర్ పీ ఠాకూర్‌

- Advertisement -

ఘటన విషయంలో తమ నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు. అయితే ఇది పోలీసుల వైఫల్యమే అని కూడా అంగీకరించారు. ఘటన జరిగిన డుంబ్రిగూడ మండలం లివిటిపుట్టు ప్రాంతాన్ని ఠాకూర్ సందర్శించారు. ఘటన జరిగిన తీరును ఉన్నతాధికారులు ఆయనకు వివరించారు.

ఘటన జరిగిన ప్రాంతం ఒడిశా సరిహద్దుకు చాలా దగ్గరకు ఉందన్న డీజీపీ.. కటాఫ్(సరిహద్దు)ఏరియా కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒడిశా పోలీసులతో కలిసి పని చేస్తామన్నారు. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్న డీజీపీ ఠాకూర్… ఘటనకు బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు

పోలీసులు, మావోయిస్టుల మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు. రామగూడ ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారని చాలా సార్లు ప్రతికార చర్యలకు ప్లాన్ చేశారని డీజీపీ తెలిపారు. ఏడు సార్లు పోలీసులు మావోయిస్టుల ప్రతీకార చర్యల నుంచి తప్పించుకున్నారని స్పష్టం చేశారు.

మావోయిస్టుల దాడికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించామని ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీఎమ్మెల్యే సివేరి సోమలను ఎందుకు హతమార్చారో దర్యాప్తులో తేలుతుందన్నారు. హత్యలపై మావోయిస్టుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఒడిశా పోలీసులతో కలిసి పని చేస్తామన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -