- Advertisement -

తెలుగుదేశాన్ని ఆ పార్టీ గట్టిగా హెచ్చరించింది..!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ నేతలేమో తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకొంటాం అంటారు. మీరు ప్రకటించుకోవడం ఏమిటి? అలా ప్రకటన చేయాల్సింది ఎన్నికల కమిషన్ కదా.. అని గుర్తు చేసినా.. ఆ పార్టీ నేతలు తగ్గరు. తమ పార్టీకి అండమాన్ వరకూ శాఖలు ఉన్నాయని..

కాబట్టి తమది జాతీయ పార్టీ అవుతుందని వారు చెప్పుకొంటారు. అంతే కాదు… ఏపీకి పక్క రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ఉనికి ఉందని వారు అంటారు.

త్వరలో తమిళనాడులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నామని.. ఏపీ, తెలంగాణల్లో విజయవంతం అయిన ఈ ప్రోగ్రామ్ ను అక్కడ కూడా చేపట్టి.. తమ సత్తా చాటతామని తెలుగుదేశం నేతలు ప్రకటించారు. మరి ఈ ప్రయత్నాల్లో ఉన్న వీరికి ఇప్పుడు ఒక తమిళపార్టీ నుంచి ఘాటైన హెచ్చరికలు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని ఆ పార్టీ హెచ్చరించింది. తమ రాష్ట్రంలోకి తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టడానికి వీలు లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది.

తమిళ మున్నేట్ర కళగం (టీఎమ్ కే) అనే తమిళ పార్టీ టీడీపీకి హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలన్న తెలుగుదేశం ప్రణాళికల పట్ల ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవైపు శేషాచలం అడవుల్లో అన్యాయంగా తమిళ కూలీలను హత్యలు చేయించిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు.. తమిళనాడులో అడుగుపెట్టడం ఏమిటి? అంటూ ఆ పార్టీ మండి పడింది. తెలుగుదేశం ఈ ఆలోచనను విరమించుకోవాలని లేకపోతే తీవ్రమైన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆ తమిళ పార్టీ హెచ్చరించింది. మరి ఈ హెచ్చరికల పట్ల తెలుగుదేశం ఎలా స్పందిస్తుందో.. తమిళనాట సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందో లేదో! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -