తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలైయ్యాయి.రాష్ట్రంలో తిరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారం చెజిక్కిచుకుంది.అయితే ఫలితాలపై మొదట ఎవరికి అనుమానం లేదు.అందరికి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. కాని సర్వేల రారాజు లగడపాటి ఎంట్రీ ఇచ్చిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది.తన సర్వేలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహకూటమి అధికారంలోకి వస్తుందని వెల్లండించారు.దీంతో చాలామంది లగడపాటి సర్వేని నమ్మి కొన్ని వందల కోట్లు పందెలు కట్టారు.అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది.లగడపాటి సర్వే తలకిందులైంది.
టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.టీఆర్ఎస్ 88 సీట్లలో విజయం సాధించగా,మహకూటమి 21 సీట్లలో మాలత్రమే విజయం సాధించింది.లగడపాటి సర్వేని నమ్ముకున్న ఓ ఆంధ్ర రైతు తన దగ్గర ఉన్న 10 ఏకరాలను పందెం కట్టాడు.పాపం ఇప్పుడు ఆ పది ఏకరాలను వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఆ రైతు పందెం కట్టింది కూడా మరెవ్వరితోనే కాదు ఆ ఏరియా మాజీ ఎమ్మెల్యేతోనే పందెం కట్టి మోసపోయాడు.మనకు తెలిసి ఈ రైతు ఒక్కడే,ఇలా లగడపాటిని నమ్మి చాలామంది కొన్ని వందల కోట్లు పొగొట్టుకున్నట్లు సమాచారం.
- ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ సునామీ.. రూ.9,500 కోట్లకు పైగా..
- సమాజం అంగీకరించలేదంటూ.. యువతుల ఆత్మహత్య!
- రీల్స్ చేస్తుందని భార్యను చంపిన భర్త!
- ‘గెలిచేదాకా ఆగకూడదు. ఆ తర్వాత మాట్లాడకూడదు’
- ఎన్టీఆర్ ను ఇమిటేషన్ చేసిన సత్య.. వరుణ్ తేజ్ ఎమన్నారంటే
