- Advertisement -

సర్పంచ్ పదవికి తండ్రీకొడుకుల పోటీ!

- Advertisement -

తెలంగాణలోని మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్‌లో సర్పంచ్ పదవి కోసం తండ్రీ–కొడుకులు నేరుగా రింగ్‌లోకి దిగడం గ్రామంలో హాట్ టాపిక్‌గా మారింది. స్థానికంగా రాజకీయ ఉత్కంఠ నెలకొనేలా తండ్రి మానేగళ్ళ రామకృష్ణయ్య మరియు కొడుకు వెంకటేష్ ఇద్దరూ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబంలోనే ఎన్నికల పోటీ నెలకొనడం గ్రామస్థులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

సాధారణంగా గ్రామ రాజకీయాల్లో కుటుంబ సభ్యులు ఒకరినొకరు సమర్థించే పరిస్థితి కనిపించినా, ఝాన్సీలింగాపూర్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. గ్రామాభివృద్ధిపై తమకే ఉన్న దృష్టి, చేపట్టాల్సిన పనులపై వేర్వేరు అభిప్రాయాల కారణంగానే తండ్రీకొడుకులిద్దరూ వేర్వేరు నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామస్థులు అంటున్నారు.

గ్రామంలో మొత్తం 1,563 మంది ఓటర్లు ఉండగా, సర్పంచ్ స్థానానికి ఇప్పటివరకు మొత్తం 10 నామినేషన్లు దాఖలు కావడం ఈ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చింది. తండ్రీకొడుకుల పోటీ నేపథ్యంలో కుటుంబ రాజకీయాలపై, గ్రామ అభివృద్ధిపై ప్రజల్లో చర్చలు జోరందుకున్నాయి.

ఈ పోటీ గ్రామస్థుల ఓటు ధోరణిని ఎలా ప్రభావితం చేస్తుందో, తండ్రీకొడుకులలో ఎవరికి ప్రజలు అధిక మద్దతు ఇస్తారో అనేది ప్రస్తుతం గ్రామంలో ప్రధాన చర్చాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -