- Advertisement -
ఖమ్మం జిల్లా పాలేరులో జరుగనున్న ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకునే స్ధాయికి ప్రచారం హోరెత్తితింది. పాలేరులో తెలంగాణ రాష్ట్ర సమతి అభ్యర్ధి ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి, పాలేరు ఎన్నికల ఇన్ ఛార్జి కె.తారకరామారావు సవాల్ విసిరారు.
తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని, మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారా అని ఆయన సవాల్ విసిరారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగజారుడు, చవకబారు రాజకీయాలు చేస్తున్నారని కెటిఆర్ విమర్శించారు. టిఆర్ఎస్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ, అభిమానం చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగుతోందని ఆయన మండిపడ్డారు.
