భారత ప్రధాని నరేంద్ర మోదీని నిజస్వరూపం బయటపెట్టడానికే నేను బీజేపీ పార్టీలో చేరానంటుంది హీరోయిన్ మాధవి లత.ప్రధాని నరేంద్ర మోదీపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన దుర్మార్గుడని తేలిపోయిందని చెప్పుకొచ్చింది మాధవి లత. ఈరోజు ఉదయం తన ఫేస్ బుక్‌లో మోదీతో పాటు బీజేపీ పార్టీ గురించి ఆమె కొన్ని విషయాలను తెలిపింది. “నేను బీజేపీ లో జాయిన్ అయ్యిందే అసలు దేశానికి బీజేపీ నిజంగా సహాయం చేస్తుందా? నాశనం చేస్తుందా? అని తెలుసు కోవడానికే.. ట్రూగా మోదీ దుర్మార్గుడు.
ఈ రోజు అయన ఏమి చేసాడో చెప్తా వినండి. ఎపుడో చిన్నపుడు స్కూల్ లో జాతీయగీతం పాడాను. మర్చిపోయి చాల ఇయర్స్ అయింది. ఎవడికి కావాలి తొక్కలో గీతం. మీటింగ్స్ పెట్టిన అదే… ఏం జరిగినా అదే… ఆఖరికి ఎంజాయ్ చేద్దామని మూవీకి పోతే జాతీయగీతమా. ఏమయ్యా మోదీ… మాకు అవసరమా? మజా చేసద్దామని సినిమాకి పోతే దేశభక్తి ఏంటి? మాకు ఛీ… పని పాట లేని పనులు మీరు. మాకొద్దు ఇలాంటివి. మేం పక్కా లోకల్. పక్కా లోకల్… అలంటి పాట పాడుకుంటాం. కిక్ వస్తది. అయ్యా మోడీ నీకు దేశభక్తి ఉంటె నువ్ పాడుకో. మాకెందుకు రుద్దడం నీవల్ల దేశానికి ఏం ఉపయోగం?” అని వ్యాఖ్యానించింది.కొద్ది రోజుల ముందు బీజేపీ పార్టీలో చేరిన మాధవి లత తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశపడింది.కాని బీజేపీ అధిష్టానం ఆమెకు సీటును కేటాయించలేదు.
ఈ రోజుల్లో ఫేం రేష్మకు మాత్రం టికెట్ ఇవ్వడంతో మాధవి లత తీవ్ర నిరాశకు గురైందని ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తన కన్నా తక్కువ పబ్లిసిటీ ఉన్న రేష్మకు టికెట్ ఇచ్చి తనకు ఇవ్వకపోవడంతోనే ఆమె ఇలా మాట్లాడుతుందని అంటున్నారు.పైగా రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పెద్దగా ఆదరణ లేకపోవడంతో ఆమె పార్టీ నుంచి ఎలా బయటికి వెళ్లాలో తెలియక ఇలాంటి కామెంట్స్ చేసి పార్టీ నుంచి బయటికి వెళ్లిందని అంటున్నారు బీజేపీ వర్గాలు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
