టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. శర్వా సినిమాలు విడుదల అవుతుంటే ఓ వర్గం ప్రేక్షకులు థియోటర్లకు క్యూ కడతారు. తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు శర్వానంద్. శర్వా హీరోగా నటించిన పడి పడి లేచే మనసు చిత్రం రేపే (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతు తన తోటి హీరో వరుణ్ తేజ్‌పై కామెంట్స్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన అంతరిక్షం సినిమా కూడా రేపే (శుక్రవారం) విడుదలవుతోంది.
ఇక్కడ ఎవరు ఎవరికి పోటీ కాదని చెప్పుకొచ్చాడు శర్వానంద్. తన సినిమాతో పాటు వరుణ్ తేజ్ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అలాగే మెగా కుటుంబంలో బన్ని – చరణ్ – వరుణ్ అందరితో కలిసే పెరిగానని – అందరం చిన్నప్పటినుంచి స్నేహితులమేనని శర్వానంద్ అన్నారు. నాకు వరుణ్ తేజ్ చిన్నప్పటి నుంచి తెలుసనని అందుకే మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలు ఉండవని చెప్పాడు. శర్వానంద్.
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలకు రంగం సిద్ధం!
- భార్యను హతమార్చి, తలను ఫ్రిడ్జ్‌లో పెట్టి..
- ప్రముఖ యూట్యూబర్ నందన అరెస్ట్!
