- Advertisement -

పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్

- Advertisement -

సినీ పరిశ్రమలో మెగా ఫ్యామీలికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. చిరంజీవి దగ్గర నుంచి సాయి ధరమ్ తేజ్ వరకు అందరికి ఈ రెంజ్ పాలోయింగ్ ఉంది అంటే అది కేవలం అభిమానులు వల్లే. అలాంటి అభిమానులి ఇప్పుడు రెండు వర్గాలు గా చీలీపోతున్నాయి. కొణిదెల ప్యామిలీ ఫ్యాన్స్, అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ గా విడిపోతున్నారు. ఇప్పటికి చాలా కాలం ముందే మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ వేరన్నట్లు తయారైంది వ్వవహారం. మెగా సినిమాలు అంటూ ఏవి విడులదైనా అందరూ సహకరించుకుంటూనే వచ్చారు.

అయితే ఇదే సమయంలో ఫ్యాన్స్ లో వేరే విధంగా కూడా వర్గాలు ఏర్పడ్డాయి. అయితే సరైనోడు హిట్ తరువాత ఈక్వేషన్లు మారినట్లు కనిపిస్తున్నాయి. మెగా హీరోలు వేరు, అల్లు హీరో వేరు అన్నట్లు వుందని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. ఇలాంటి సమయంలో విజయవాడ సంఘటన ఈ మొత్తం వ్యవహారానికి ఆజ్యం పోసింది. చిరంజీవి పట్ల గౌరవం అభిమానం, అపరిమితంగా ప్రకటించిన బన్నీ అదే వేదిక పై పవర్ స్టార్ అభిమానులు కోరికను మాత్రం తిరస్కరించాడు. ‘చెప్పను బ్రదర్’ అని నిర్మొహమాటంగా అనేసాడు.

దీని వెనుక అంతర్గత విషయాలు వేరే వున్నాయని వినికిడి. సరైనోడు సినిమాను తొక్కాలని కొందరు ప్రయత్నించారన్న అన్న అభిప్రాయం అల్లు ఫ్యామిలీలో వుందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. విజయవాడ సంఘటన దగ్గర నుంచి ఈ వ్యవహార ముదిరి ముదిరి బన్నీపై పోస్టర్ల వరకు చేరింది. మరోపక్క రాబోయే పది రోజులు కూడా సరైనోడును బాగా ప్రమోట్ చేసి, గబ్బర్ సింగ్ రికార్డులు బద్దులు కొట్టాలన్న ఆలోచనలో వున్నారట. ఎక్కడ రికార్డులు ఏమిటి? సరైనోడు పొజిషన్ ఏమిటి? అన్న లెక్కలు అన్నీ తీసే పనిలో బిజీగా వున్నారట బన్నీ ఫ్యాన్స్. మొత్తం మీద ఇకపై మెగా ఫ్యామిలీ సినిమాలు వచ్చినపుడు ఇప్పటి ఈ సంఘటనల నీడలు వాటిపై పడేలాగే వున్నాయి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -