- Advertisement -

చంద్రబాబు, జగన్ లపై పోటీకీ సై అంటున్న కాంగ్రెస్ నేత‌..

- Advertisement -

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ప్ర‌ధానంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్య‌నే హోరాహోరీ పోరు జ‌రుగుతుంద‌న‌డంలే సందేహంలేదు. ఇప్ప‌టి నుంచే అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో దూసుకెల్తుంటే, బాబు పార్టీశ్రేణుల‌ను ఎన్నిక‌ల యుద్ధాన‌కి సిద్ధం చేస్తున్నారు. ఈ సారి బాబు జ‌న‌వ‌రిలోనే అభ్య‌ర్తుల మొద‌టి జాబితా విడుళ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఇక జ‌గ‌న్‌కూడా తానేమీ త‌క్కువ కాద‌ని..పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల జాబితాను సిద్ధం చేశారు.

ఇదిలా ఉంటే మ‌రో ప‌క్క ప‌న‌వ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీకూడా ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసి త‌మ స‌త్తా చాటాల‌ని చూస్తున్నారు . ఎన్నిక‌ల పోటీ ప్ర‌ధానంగా మూడు పార్టీల మ‌ధ్యే ఉండ‌నుంది.ఇక క‌నుమ‌రుగు అయిన కాంగ్రెస్ పార్టీ ప్ర‌త్యేక హోదాతో మ‌రో సారి ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తోంది. విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టినుంచి ఇప్పుటి వ‌ర‌కు ఒక్క మాట మాట్లాడ‌ని కాంగ్రెస్ నాయ‌కుల‌… ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకుంటున్నారు.

తాజాగా కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీతో పొత్తు పెట్ట‌కోవ‌డం వ‌ల్లే తెలంగాణాలో కాంగ్రెస్ ప‌రాజ‌యం పాల‌య్యింద‌న్నారు. కాంగ్రెస్‌, టీడీపీ పొత్తును టీ ప్ర‌జ‌లు తిర‌స్క‌రించాన్నారు. త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర చేప‌డ‌తామ‌ని తెలిపారు.

క్రిస్మస్ కానుకల పేరిట దళిత ప్రజలకు చేరువయ్యేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని… ఆయన కుయుక్తులను ఎవరూ నమ్మరని అన్నారు. అధిష్ఠానం ఆదేశిస్తే… కుప్పం (చంద్రబాబు), పులివెందుల (జగన్)లపై పోటీ చేసేందుకు కూడా తాను సిద్ధమేనని ప్ర‌క‌టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -