- Advertisement -

క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌…టీడీపీకీ బూస్ట్‌..

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్‌కు బిగ్ షాక్ త‌గిలేలా ఉంది. ఆ పార్టీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి కోట్ల సైకిల్ ఎక్కేందుకు సిద్ద‌మ‌య్యారు. తెలంగాణాలో మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు ఉంటుంద‌నే సంకేతాలు ఇరు పీర్టీల నేత‌లు ఇచ్చారు. అయితే ఇప్పుడు మాత్రం పొత్తు ఉండ‌ద‌ని ఒంట‌రిగానే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పొత్తు ఎఫెక్ట్ పార్టీపై ప‌డింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తున్న కోట్ల పార్టీ మారేందుకు సిద్ద‌మ‌య్యారు. రాష్ట్ర కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరును బట్టి చూస్తే…త్వరలోనే ఆయన పార్టీ మారడం ఖాయమని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. టీడీపీతో పొత్తు లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో గత కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఏకపక్ష ధోరణిని అవలంబిస్తోందని ఆరోపణలు చేస్తున్న కోట్ల, తాజాగా, తన అభిమానులు, అనుచరులతో పార్టీ మారాల‌ని ఒత్తిడి చేస్తున్నారు.

గ‌తంలో వైసీపీలో చేరుతార‌నే వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని… అందులో భాగంగా కర్నూలు ఎంపీ సీటుతో పాటు తన భార్యకు ఎమ్మెల్యే సీటు కూడా వస్తుందని ఆయన ఆశించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పొత్త ఉండ‌దని అధిష్టానం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నా అయ‌న పార్టీ మారేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఆయ‌న కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలోకి వెల్తారా లేకా టీడీపీలోకి వెళ్తార‌నే ప‌లు ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయ‌న ఎక్కువ‌గా టీడీపీలోకి వెల్లే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రో వైపు అనుచ‌రులు కూడా టీడీపీలో చేరాల‌ని ఒత్తిడి చేస్తున్నారు. మ‌రో వైపు కోట్ల‌ను ఆపేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఆయ‌న‌ను బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నాలను ముమ్మ‌రం చేసింది. మ‌రి ఇప్పుడు కోట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి….?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -