ఊరి.. ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ సక్సెస్‌ఫుల్ స్టోరిపై తీసిన సనిమా. ఎలాంటి హంగులు లేకుండా.. చాలా తక్కువ స్క్రీన్లలో రిలీజై ఎలాంటి బజ్ లేకుండా మౌత్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న మూవి ఇది. ఇప్పటికే ఈ మూవీని చూసిన ప్రధాని మోదీ.. ఆకాశానికి ఎత్తేశారు. ఇప్పుడు రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సినిమాను చూసి.. యూనిట్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారు.
విక్కీ కౌశల్.. యామినీ గౌతం, పరేశ్ రావెల్ లీడ్ రోల్స్‌తో రూపొందించిన ఈ సినిమానుబెంగళూరులోని ఒక మాల్‌లో రక్షణ శాఖ అధికారులు.. మాజీ అధికారులతో పాటు.. అమరవీరులైన సైనిక కుటుంబాలతో కలిసి చూశారు నిర్మలా.
నిర్మలా రాకతో బెంగళూరులోని పీవీఆర్ సెంట్రల్ స్పిరిట్ మాల్ కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా సైనిక కుటుంబాలతో ఆమె సెల్ఫీలు దిగారు. సినిమా చూసిన వెంటనే తన స్పందనను సోషల్ మీడియాలో ట్వీట్ రూపంలో తెలియజేశారు. భారతమాతాకీ జై.. వందేమాతరం.. హౌ ద జోష్ ? అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు ఊరి దేశవ్యాప్తంగా 138 కోట్ల షేర్‌ను రాబట్టింది.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్‌బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
