Sunday, May 5, 2024
- Advertisement -

పులివెందులలో గెలుపు అన్న బాబు, ఆర్కే… కడప ప్రజల షాకింగ్ రియాక్షన్

- Advertisement -

‘2019 ఎన్నికల్లో పులివెందులలో కూడా గెలుస్తాం’….ఇదీ లేటెస్ట్ చంద్రబాబు డైలాగ్. ఆ వెంటనే పులివెందులలో టిడిపి గెలుపు ఖాయం అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన మార్క్ పసుపు కథ అల్లుతూ విశ్లేషణ. ఆ విశ్లేషణలో కూడా పులివెందుల ప్రజలకు వైఎస్‌లపై అభిమానం ఉంది అని ఒప్పుకోలేని కుచ్చితం. దేశంలోనే అత్యధిక పర్సంటేజ్ ఓట్లతో వైఎస్ జగన్‌ని గెలిపించి జగన్‌పై ఉన్న అభిమానాన్ని కడప ప్రజలు ఎలుగెత్తి చాటితే ఆ విజయాన్ని కూడా వక్రించే బుద్ధి పచ్చ బ్యాచ్‌కే సొంతం. కడప రౌడీలు, గూండాలు అంటూ స్వయంగా చంద్రబాబే పెట్రేగిపోతూ ఉంటారు. ఇక పచ్చ బ్యాచ్ మీడియా అంతా కూడా అదే శైలిలో వార్తలు రాస్తూ ఉంటుంది. కానీ చిరంజీవిలాంటి పొలిటికల్ కమెడియన్ కూడా పులివెందుల గడ్డపై కేవలం రెచ్చగొట్టాలన్న ఉద్ధేశ్యంతో తొడగొట్టాడు, మీసం మెలేశాడు. ఏమైనా జరిగిందా? ఎవరైనా దాడిచేశారా? ఇక చంద్రబాబు మనుషులు కడపలో చేసే రచ్చ అంతా ఇంతా ఉండదు. జనాలను రెచ్చగొడితే ఏమైనా గొడవలు జరిగితే అంతా కూడా వైఎస్‌లపైన తోసేయొచ్చు, వైఎస్‌లను ఫ్యాక్షనిస్ట్‌లు ప్రచారం చెయ్యొచ్చు అన్న దుష్టపన్నాగాలు ఎన్ని సార్లు పన్నారో?

అలాంటి పచ్చ బ్యాచ్ జనాలు ఎన్నికలు వచ్చే ప్రతిసారీ కూడా పులివెందులలో కూడా గెలుస్తాం అని కామెడీ చేస్తూ ఉంటారు. తాజాగా కూడా అలాంటి ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అండ్ ఆయన భజన మీడియా బ్యాచ్‌కి పులివెందుల ప్రజలు షాక్ ఇచ్చారు. టిడిపికి తమ నిరసన తెలియచేశారు. కడప గూండాలు, పులివెందుల రౌడీలు అన్న కడప ప్రజల గురించి నీచంగా మాట్లాడిన చంద్రబాబుకు కడప జిల్లాలో ఒక్క సీటు కూడా గెలిచే సీన్ లేదని ఎద్దేవా చేశారు. పులివెందుల ప్రజలకు, కడప ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని, రాయలసీమ రౌడీలు అంటూ రెచ్చిపోయి మాట్లాడే బాబు, ఆయన భజన మీడియా జనాలంతా తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ సారి ఒక్క కడపలోనే కాదు, రాయలసీమ అంతటా కూడా టిడిపికి ఘోర ఓటమి తప్పదని ప్రజా సంఘాల జనాలు సభలు పెట్టి మరీ టిడిపిని తిట్టిపోయడం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఇప్పటికైనా కడపలో గెలుస్తాం, పులివెందులలో జగన్‌ని ఓడిస్తాం లాంటి కామెడీ డైలాగ్స్‌ని చంద్రబాబు, ఆయన భజన మీడియా జనాలు, టిడిపి ని నాయకులు మాట్లాడకుండా ఉంటే కాస్తైనా పరువుగా ఉంటుందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీకి ఓట‌మి త‌ప్ప‌దా….? అందుకే మ‌రో కొత్త రాజ‌కీయానికి తెర‌ లేపిన బాబు…?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -