Thursday, May 9, 2024
- Advertisement -

రాయచోటి..గడికోటదే!

- Advertisement -

ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం…ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారింది. ఆ నియోజకవర్గం పేరు చెబితే గుర్తుకొచ్చేది ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఇంతకి ఆ నియోజకవర్గం ఏంటనుకుంటున్నారా..రాయచోటి.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు శ్రీకాంత్ రెడ్డి. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు దక్కించుకున్నారు. ఈసారి కూడా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు శ్రీకాంత్ రెడ్డి. టీడీపీ తరపున మండిపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

2009లో తొలిసారి రాయచోటి నుండి గెలుపొందారు శ్రీకాంత్ రెడ్డి. ఆ తర్వాత జగన్ వెంట నడిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో ఉప ఎన్నికల్లో మళ్లీ వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014, 2019 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు శ్రీకాంత్ రెడ్డి. ఈ నియోజకవర్గంలో మొత్తం రెండు లక్షల 31 వేల 637 ఓట్లు ఉండగా బలిజ సామాజికవర్గం ఓట్లే ఎక్కువ.

నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేశారు శ్రీకాంత్‌రెడ్డి. దీనికితోడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,తాను చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామ్‌ప్రసాద్‌ రెడ్డి ఫ్యామిలీ సైతం రాయచోటిలో చక్రం తిప్పినవారే. రామ్‌ప్రసాద్ రెడ్డి తండ్రి నాగిరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా,సోదరుడు ఓసారి ఎమ్మెల్యే గెలుపొందారు. బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి అగ్రవర్ణానికి చెందిన వారైన ఆయన్ని ఓడించడం అంత తేలికకాదు. దీనికి తోడు టీడీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి గెలుపు వైసీపీదేనని అభిప్రాయం వ్యక్తమవుతుండగా ఓటర్లు ఎవరి వైపు ఉంటారో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -