ఏబీఎన్ రాధాకృష్ణ, చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. విజయసాయికి సంబంధించిన జగన్ ను కించపరిచేలా మాట్లాడుతున్నట్లు ఆడియే టేపులను ఏబీఎన్ ఛానల్ ప్రసారంచేయడంపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే…నీ ఛానల్లో టెలికాస్ట్‌లో …వాయిస్‌ను నాదని నిరూపించు అంటూ సవాల్ విసిరారు. టీడీపీ ప్రయోజనాలకోసం రాధాకృష్ణ పాకులాడుతున్నారని మండిపడ్డారు. నిన్న లక్ష్మీపార్వతి, ఈరోజు నా మీద, రేపు ఇంకొకరిపై ఉద్దేశ్య పూర్వకంగానె ఇలాంటి అసత్య ప్రచారాలే చేస్తాడన్నారు. రాధాకృష్ణ సమాచాజినికి పట్టిన చీడ పురుగని ఘాటుగా విమర్శించారు.
బాబుతో కలిసి నువ్వు దోచుకున్న సొమ్మును అధికారంలోకి రాగానె కక్కిస్తామన్నారు. నీపై ఈసీకి, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్‌కు ఫిర్యాదు చేస్తాం. ఆడియోలో ఆ వాయిస్ ఎవరన్నది…సీఎఫ్‌ఎల్‌సీకి నిర్థారణ చేసిన అసలు విషయం తెలుస్తుందన్నారు. చంద్రబాబు మాత్రమే కాదు… గత అయిదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి సహకరించిన వారందరూ…ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా జైలుకు వెళతారని జ్యోష్యం చెప్పారు. విశాఖలో ఓ గర్భిణీ స్త్రీపై వైఎస్సార్ సీపీ దాడి చేశారని చంద్రబాబుతో పాటు ఆంధ్రజ్యోతిలో అడ్డగోలు కథనాలు ప్రచురించిందన్నారు. విశాఖ పోలీసులు మహిళపై దాడికి సంబంధం లేదని చెప్పిన బాబు ఇంకా వైసీపీపై బురద జల్లుతున్నారని విమర్శించారు.
నాలుగున్నరేళ్లలో రాధాకృష్ణకు ఇంచుమించు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికకు ప్రకటనలతో పాటు వివిధ రూపాల్లో రూ.1500 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మరో 1500 కోట్లకు సెటిల్మెంట్లు చేశారని ఆరోపించారు. పత్రికాముఖంగా చెబుతున్నా. చంద్రబాబుతో పాటు రాధాకృష్ణ కూడా జైలుకు వెళతాడు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక టీడీపీ విడుదల చేసిన మ్యేనిఫెస్టోపై కూడా విరుచకు పడ్డారు. గత ఎన్నికల్లో 650కి పైగా హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు 36 పేజీల టీడీపీ మ్యానిఫెస్టోను విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాబుకు బుద్దిచెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోయేలే మ్యానిఫెస్టోను విడుదల చేశారని, రాజన్న రాజ్యం మళ్లీ ప్రజలకు అందేలా ఈ మ్యానిఫెస్టో ఉందన్నారు.
