బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి, ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగణ్ ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని శాంతాక్రజ్ వీరూ దేవగన్‌కు ఇవాళ గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. తండ్రి ఆరోగ్యం సరిగా లేని కారణంగానే.. అజయ్ దేవగన్ తన తాజా చిత్రం దేదే ప్యార్ దే సినిమా ప్రమోషన్‌కు హాజరుకాలేదు.
1983లో వచ్చిన హిమ్మత్‌వాలా, 1988లో వచ్చిన షెహన్‌షా, 1994లో వచ్చిన దిల్‌వాలే చిత్రాలకు వీరూదేవగన్ యాక్షన్ సన్నివేశాలను డైరక్ట్ చేశారు. 1980 దశకంలో వచ్చిన అనేక చిత్రాలకు యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు వీరూ దేవగన్ చేసేవారు. వీరూదేవగన్ పార్థివదేహానికి ఇవాళ సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తరణ్ ఆదర్శ్ ట్వీట్‌లో తెలిపారు.
