పూర్తి మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ఐదు సంవత్సరాలు జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సాగించవచ్చు. ఓటమి షాక్ నుంచి కోలుకోక ముందె టీడీపీకి అదిరిపోయె షాక్‌లు తగులుతున్నాయి. టీడీపీ తరుపున గెలిచిన నియోజక వర్గాల్లో అభివృద్ధి జరగాలంటె వైసీపీ ప్రభుత్వానకి అనుకూలంగా ఉండాలి..లేకుంటె అభివృద్ధి మీద ఆశలు వదులు కోవాల్సిందే. భవిష్యత్తులో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చే సూచనలు లేకపోవడంతో ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలు పార్టీమారెందుకు సిద్దమవుతున్నారు.చంద్రబాబు తర్వాత టిడిపిని నడిపించే రథసారధి ఎవరు అనే విషయంలో చాలామందికి లోకేష్ పై నమ్మకం కలగడం లేదు.
వైసీపీలో వచ్చేందుకు చాలామంది నేతలు సిద్దంగా ఉన్నా జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి టీడీపీ తరఫున వరుసగా రెండోసారి అసెంబ్లీకి ఎన్నికైన నిమ్మల రామానాయుడు వైసీపీలోకి సిద్దంగా ఉన్నారు. జగన్ వేవ్‌లో కూడా రెండో సారి గెలిచాడంటే స్థానికంగా అతనికి ఎంత బలం ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు మూడు రోజులుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా హైలెట్ అవుతోంది.
ఇక్కడ నిమ్మలను ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి అయితేనే కరెక్ట్ అని భావించిన వైసిపి అధిష్టానం ఎన్నికలకు ముందు బాబ్జీని ఏరికోరి మరీ వైసీపీలోకి ఆహ్వానించింది. ఏరికోరి ఆయన్ను రంగంలోకి దింపినా నిమ్మల రామానాయుడు గెలుపొందడం విశేషం.
ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్న తనకు ఎలాంటి ఉపయోగం లేదని… వైసీపీ లోకి వెళితే నియోజకవర్గంలో అభివృద్ధి అన్న జరుగుతుందని… ఈ క్రమంలోనే పార్టీ మారితే ఎలా ? ఉంటుందని తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈవార్తలపై స్పందించిన రామానాయుడు పార్టీ మారే ఉద్దేశ్యం లేదని పైకి చెప్తున్నా….కొద్ది రోజుల్లో వైసీపీ ఖండువా కప్పుకుంటారనె వార్తలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో టీడీపీకీ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని కొందరు వైసీపీ నేతలు ఉన్నారు.
