ఇదొక ఆశ్చర్యకర విషయం . ఏకంగా హీరో రోడ్డుమీదకి వచ్చి నిరాహార దీక్ష చేస్తున్నాడు. తన సినిమాని విడుదల చెయ్యడానికి థియేటర్ లు లేవు అంటూ గగ్గోలు పెడుతున్నాడు అతను. హీరో ఆదిత్య ఓం గుర్తున్నాడా ? లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితుడు అయిన మనోడు ఇప్పుడు ఫిలిం ఛాంబర్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నాడు.
ఈ మధ్యన అతను డైరెక్టర్ గా మారి తీసిన ఫ్రెండ్ రెక్వస్ట్ అనే సినిమా ని విడుదల చెయ్యడానికి దిల్ రాజు అడ్డం పడుతున్నాడు అనేది అతని వాదన. ”నిజానికి నా సినిమాకు 150 ధియేటర్లు కావాలి. ఈజీగానే అన్నేసి ధియేటర్లు దొరుకుతాయి అనుకున్నాను. కాని చివరకు హైదరాబాద్ లో 20 ధియేటర్లు అడిగితే 1 చేతిలో పెట్టారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రంలలో 30 ధియేటర్లలో సినిమా రిలీజైంది. 4.5 కోట్లతో తీసిన సినిమాకు ఇలా ధియేటర్లు దొరక్కపోతే..
ఇన్వెస్టుమెంటును ఎలా రికవర్ చేసుకుంటాను నేను? అందుకే నా సమస్య తీరేవరకు ధర్నా చేస్తాను” అనేది ఇతని వాదన. దిల్ రాజు మొదట అన్ని థియేటర్ లూ ఇస్తాం అని చెప్పి కూడా ఇప్పుడు హ్యాండ్ ఇచ్చారు అంటున్నాడు ఆదిత్య.
