జమ్మూ&కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 35 మంది అక్కడి కక్కడే దుర్మరనం పాలయ్యారు. 45 మంది ప్రయాణీకులతో కిష్టావర్ నుంచి కేశ్వాన్కు బయల్దేరిన మినీబస్సు మలుపు తీసుకునే క్రమంలో అదుపు తప్పి లోయలో పడిపోయింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోనే ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 35 మంది మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
45 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. కిష్ట్వార్ జిల్లాలో ఇవాళ ఉదయం 7.30 సమయంలో లోయలో పడిపోయింది. బస్సు స్కిడ్ అయి.. సిర్గ్వారీ వద్ద లోయలో కి దూసుకెల్లింది . చనిపోయిన వారిలో 20 మంది మృతదేహాలను వెలికితీశారు.ఇంకా అక్కడ సహాయక కొనసాగుతున్నాయి.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఘటనపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
