- Advertisement -

తెలుగు రాష్ట్రాల మధ్య బంధం పెంచిన రేవంత్ రెడ్డి!

- Advertisement -

ఒక వైపు రెండు రాష్ట్రాల మధ్య రేవంత్ రెడ్డి కేసు దూరాన్ని పెంచుతుంటే ఆయన కూతురి పెళ్ళి సంబందం సఖ్యతను పెంచుతోందని అందరి అభిప్రాయం. భీమవరం బుల్లోడితో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఎన్ కన్‌వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసు ఆరోపణలతో రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆయన కూతురి నిశ్చితార్థం కోసం 12 గంటల బెయిలు మంజూరు చేసింది.

ఉదయం 6 గంటలకే ఆయన తన నివాసానికి చేరుకొని భార్య, పిల్లలు, బంధువులతో  కలిసి ఎన్‌కన్‌వెన్షన్ సెంటర్ కి చేరుకున్నారు. కేసు కోర్టులో ఉన్నందున నిశ్చితార్థం మొత్తం పోలీస్ నిఘాలో జరిగిందని సమాచారం. టిడిపి అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు హాజరై రేవంత్ రెడ్డి పక్కనే కూర్చొని తన కుమార్తెకు ఆశీస్సులు తెలిపారు. ఇక కోర్టు ఆంక్షల కారణంగా ఏసిబి అధికారులు, నిఘా సిబ్బంది అక్కడే ఉన్నారని తెలిసింది. రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రత్యేక వాదిగా ఉంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండేవారు. అలాంటిది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసి అయిన సత్యనారాయణా రెడ్డి ని అల్లుడిగా చేసుకోవడం విశేషం. ఇలాంటి పరిణామాలు రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను పెంచుతాయని అందరూ భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు బంధాన్ని పెంచాడని కూడా చెప్పుకోవచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -