ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆర్టిస్ట్‌లలో నటి హేమ ఒకరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించి తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. వినయ విధేయ రామ సినిమాలోలో హేమ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా హేమ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సంచలన విషయాలు చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో పాటు, పూరి జగన్నాథ్, ఛార్మి, బోయపాటిల గురించి కామెంట్స్ చేసింది హేమ ఇక మీకు ఎప్పుడైన లైంగిక వేధింపులు ఫేస్ చేశారా అనే ప్రశ్నకు సమాధానం ఇస్తు.. శ్రీహరి గారు చనిపోయినప్పుడు , చాలామంది ఆయనను చూడటానికి వచ్చారు. వేల మంది ఉన్నారు. అందులో ఎవడో నా నడుమును గిల్లాడు. అయితే వెంటనే వాడిని పట్టుకుని తుక్కుతుక్కుగా కొట్టానని చెప్పుకొచ్చింది. నా గురించి తెలిసిన వాడు ఎవడు నాతో వ్యవహారం పెట్టుకోడని తెలిపింది ఈ సీనియర్ ఆర్టిస్ట్.
- అనాథ అవుతుందని.. భార్యను హతమార్చి..
- 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడు ఎన్ కౌంటర్!
- విజయ్ చేయాల్సిన ‘డీసీ’, అసలు నిజమేంటి?
- ఇది కేవలం నా సినిమా కాదు.. గ్లోబల్ ఇండియన్ మూవీ: యశ్
- ‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్ సునామీ.. రూ.9,500 కోట్లకు పైగా..
