విజయశాంతి గురించి మనకి తెలియని విషయాలు..!

- Advertisement -

టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ గా ఓ వెలుగు వెలిగినప్పటికి.. విజయశాంతికి మాత్రం ఓ స్పెషల్ స్థానం ఉంది. అయితే వాస్తవానికి శాంతిగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచమైన ఈమెకు.. అప్పటి నటి విజయలలిత గారు స్వయానా పిన్ని అన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే ఈమె పేరు విజయశాంతి అయింది.

ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ నటించిన ‘సత్యం శివం’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయశాంతి.. ‘నేటి భారతం’ చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తక్కువ టైములోనే స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వాళ్లతో నటించి స్టార్ హీరోయిన్ అయింది. ఇంకోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ’కర్తవ్యం’ సినిమాకు గాను విజయశాంతికి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఈమె ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియదు.

- Advertisement -

ముఖ్యంగా ఈమె భర్త గురించి ఎవరికి తెలియదు. ఓ స్టార్ హీరోయిన్ అయ్యుండి కూడా.. చాలా సింపుల్ గా పెళ్ళి చేసుకుందట విజయశాంతి. ఇక ఈమె భర్త పేరు శ్రీనివాస ప్రసాద్. ఇతనితో విజయశాంతి కలిసి ఉన్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. విజయశాంతి రాజకీయాల్లోకి రావడం వెనుక కూడా ఈయన ప్రోత్సాహం ఉందట. ఇక ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో విజయశాంతి నటించిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -