బంగ్లాదేశ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ అందుబాటులో ఉండటం లేదు. వారి స్థానంలో జోష్ ఇంగ్లిస్ తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగనున్నారు. మొదట కేవలం పాకిస్తాన్ వన్డేల కోసమే ఎంపికైన ఆలివర్ పీక్, మాట్ షార్ట్‌లను బంగ్లాదేశ్ వన్డేల కోసం కూడా జట్టులోనే కొనసాగించారు.
ఇప్పటివరకు కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడిన ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీని కూడా ఈ వన్డే జట్టులోకి తీసుకున్నారు. లాహోర్‌లో జరిగిన రెండో వన్డేలో గజ్జల్లో గాయానికి (హామ్‌స్ట్రింగ్) గురైన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా స్థానంలో మర్ఫీ జట్టులోకి వచ్చాడు.
బంగ్లాదేశ్‌తో జరిగే వన్డేలు, టీ20లు రెండింటికీ ట్రావిస్ హెడ్ మొదట ఎంపికైనప్పటికీ, వ్యక్తిగత కారణాల వల్ల అతను సెలవు తీసుకున్నాడు అని ఆసీస్ చీఫ్ సెలెక్టర్ వెల్లడించారు. మరోవైపు మిచెల్ మార్ష్ గాయం కారణంగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే టీ20 సిరీస్ కోసం సిద్ధమవడానికి అతను ఢాకాలో జట్టుతో కలవనున్నాడు.
మొదటి వన్డే మ్యాచ్ మంగళవారం జూన్ 9న ఢాకాలో జరగనుంది. మిగిలిన మ్యాచ్‌లు అదే వేదికపై జూన్ 11 మరియు 14 తేదీల్లో జరుగుతాయి. అనంతరం జూన్ 17 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.
ఆస్ట్రేలియా జట్టు:
జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కానలీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, మాథ్యూ కుహ్నెమన్, మార్నస్ లాబుషేన్, టాడ్ మర్ఫీ, ఆలివర్ పీక్, మాథ్యూ రెన్షా, లియామ్ స్కాట్, మాట్ షార్ట్, ఆడమ్ జంపా.
