- Advertisement -

చిన్న గొడవ…యూట్యూబర్ వైష్ణవిని చంపిన భర్త!

- Advertisement -

తెలంగాణలోని కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి గొడవ పెద్దదై, నాలుగు నెలల గర్భిణీ అయిన భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

హరిబాబు అనే యువకుడు ఎనిమిది నెలల క్రితం యూట్యూబర్ వైష్ణవిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాత్రి సమయంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చింది.

నాలుగు నెలల గర్భిణీ అయిన వైష్ణవిపై హరిబాబు దాడి చేసి, కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వైష్ణవి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, అవసరమైతే ఉరిశిక్ష ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామే న్యాయం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -