పవన్‌కు బన్నీకి మధ్య విభేధాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అప్పుడెప్పుడో చెప్పను బ్రదర్ అంటూ పవన్ ఫ్యాన్స్ కు అల్లు అర్జున్ చెప్పిన ఒక్క మాట కారణంగా.. మెగా ఫ్యాన్స్ మధ్య కొన్ని అంతరాలు వచ్చాయి. బన్నీ ఫ్యాన్స్ అంటూ ఓ సెపరేట్ కేటగిరీ బయలుదేరగా పవన్ ఫ్యాన్స్ వారిని సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేయడం ప్రారంభించారు.దువ్వాడ జగన్నాథమ్ సినిమా రీలిజ్ అప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకు బాగా నెగిటివ్ ప్రచారం చేశారు.ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ వ్యవహరంలోకి పవన్‌ను లాగడంతో నిన్న అల్లు అర్జున్ వాళ్ల తండ్రి అల్లు అరంవిద్ ప్రెస్ మీట్ పెట్టి పవన్‌కు సపోర్టుగా మాట్లాడారు.
తాజాగా పవన్ కళ్యాణ్ ని-ఆయన తల్లిని ఉద్దేశిస్తూ శ్రీరెడ్డి తిట్టడం దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడనే విషయం బయటపడడం.. అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వర్మను చీల్చి చెండాడడం వంటివి కనిపించాయి. ఆ తర్వాత ఈ మొత్తం ఇష్యూపై పవన్ కళ్యాణ్ స్పందించాడు. ఎక్కడా మాట్లాడకపోయినా.. ట్విట్టర్ లో కొన్ని పోస్టులను చేయడం ద్వారా తన ఉద్దేశ్యాలను చెప్పుకొచ్చాడు పవన్. కన్నతల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే తాను బతికి ఉండడమే అనవసరం అన్నాడు పవన్.
దీంతో పాటు రాంగోపాల్ వర్మను ఉద్దేశించి కామెంట్స్ చేసినా.. ఎక్కడా వర్మ పేరు ఎత్తలేదు.పవన్ చేసిన అన్ని పోస్టులను అల్లు అర్జున్ తన అఫీషియల్ టైం లైన్ లో రీట్వీట్ చేయడాన్ని విశేషంగా చెప్పుకోవాలి. వరుసగా నెంబర్ ఇస్తూ 5 పోస్టులు చేసిన బన్నీ.. ‘తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే.. నేను చనిపోవడమే ఉత్తమం’ అని రాసుకొచ్చాడు. తన తండ్రి లాగే ప్రెస్ మీట్ పెట్టి పవన్‌కు సపోర్టు చేయలని భావిస్తున్నాడు బన్నీ. బన్నీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉనట్లు తెలుస్తుంది.
