‘క్షణం’, ‘రంగస్థలం’ వంటి సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించిన హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు ‘కథనం’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 9న విడుదలకు సిద్దమవుతోంది. అయితే అదే రోజున అక్కినేని నాగార్జున నటిస్తున్న ‘మన్మధుడు 2’ సినిమా కూడా భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతుంది. నాగార్జున సినిమా తో పోటీపడి తన సినిమాను విడుదల చేస్తున్నందుకు అక్కినేని అభిమానులు అనసూయపై కామెంట్లు చేశారు. కానీ ఆమె స్వయంగా తను నాగ్ సార్ కి పోటీని కాదని తను కూడా నాగార్జునకి అభిమానిని అని చెప్పడంతో కొందరు చల్లబడ్డారు.
అయితే మరికొందరు మాత్రం ఇప్పటికీ అనసూయపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. మరోవైపు అనసూయ మరియు ‘కథనం’ టీం నాగార్జున నుండి ఒకటి ఆశిస్తున్నారట. అదే ‘కథనం’ సినిమా గురించి ఒక మంచి మాట. నాగార్జున సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడితే సినిమాకి బజ్ పెరుగుతుందని వారి ఉద్దేశం. మరోవైపు మన్మధుడు సినిమా కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సినిమాలో హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్, లక్ష్మీ, దేవదర్శిని, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
