డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు.మరొకటి వీరనారి రాణీ లక్ష్మీ భాయ్ జీవితగాథ మణికర్ణిక. కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మణికర్ణిక.అయితే క్రిష్ ఫోకస్ మొత్తం మణికర్ణిక సినిమా మీదే పెట్టినట్టున్నాడు.దీనిలో భాగంగానే మణికర్ణిక షూటింగ్ ప్రస్తుతం రీషూట్ జరుపుకుంటోంది.
గతేడాది మేలో షూటింగ్ ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. ఈ ఏడాది సమ్మర్‌లో రీలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కీలక సన్నివేశాల అవుట్ పుట్‌పై అసంతృప్తితో ఉన్న క్రిష్. రీషూట్ చేయాలని నిర్ణయించాడు. ఈ క్రమంలోనే రిలీజ్ ఆలస్యం అయ్యింది. ప్రస్తుతం రీ షూట్ జరుపుకుంటుండగా, ఈ కారణంగా బడ్జెట్ మరో ఐదు కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కథను అందించాడు దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఎన్టీఆర్ బయోపిక్‌లో పాల్గొన్నాలని భావిస్తున్నాడు క్రిష్.
