- రామ్‌చరణ్ సరసన అనూఇమ్మాన్యుయేల్
- వరుస ఆఫర్లతో బిజీబిజీ
ఒక్క సినిమాతో క్రేజీ ఇమేజ్ను సంపాదించుకున్న హీరోయన్లు చాలామందే ఉన్నారు. ఒక్క సినిమా హిట్టయితే చాలు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తుంటాయ్. కొద్ది రోజులకే స్టార్ హీరోయిన్గా ఎదిగిపోతారు. తొలుత కొన్ని సినిమాలు హిట్ కాకున్నా అలా చేస్తూపోతే ఒక్క హిట్ తగలకపోదా… మేం నిరూపించుకోలేమా అని నటించి విజయాల బాట పట్టిన హీరోయిన్లు ఎందరో. అందులో కాజల్, రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ఉన్నారు. వీరి సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నిలుస్తోంది.
మజ్ను సినిమాతో తెలుగమ్మాయిగా అను ఇమ్మాన్యుయేల్ పేరుతెచ్చుకుంది. ఒక్క సినిమాతో అందరికీ గుర్తుండిపోయింది. ఆ తర్వాత రాజ్‌తరుణ్‌తో కలిసి కిట్టు ఉన్నాడు జాగ్రత్త అనే సినిమా చేసింది. ఆ సినిమా మామూలుగా నడిచింది. అయితే ఆ సినిమా తర్వాత పెద్ద ఆఫర్ తన ముందు వచ్చింది. ఏకంగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. ప్రస్తుతం అజ్ఞాతవాసి సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ సినిమా తర్వాత ప్రాజెక్టులు కూడా ఒప్పేసుకుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో నటించేందుకు ఒప్పేసుకుంది. ఆ తర్వాత సినిమా మారుతీ దర్శకత్వంలో వస్తున్న నాగ చైతన్య సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
ఈ సినిమాల అనంతరం వెంటనే రామ్‌చరణ్‌తేజతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రంగస్థలం 1986 సినిమా తర్వాత చెర్రీతో నటించేందుకు అవకాశం వచ్చినట్లు టాక్. బాబాయ్ పవన్‌కల్యాణ్ (అజ్ఞాతవాసి) తర్వాత అబ్బాయ్‌తో నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=Gt5mCJLQEFU
