రాజమౌళి సంచలనాత్మకంగా రూపొందిస్తున్న సినిమా బాహుబళి. దేశ వ్యాప్తంగా ఏ సినీ అభిమాని నోట విన్నా ’బాహుబళి’ హాట్ టాపిక్‌గా మారింది. పైగా ఈ చిత్రాన్ని కరణ్‌జోహార్ రిలీజ్ చేస్తుండటంతో మరింత ప్రచారం ఏర్పడింది. ఇదిలా ఉండగా ఇప్పుడు సోషల్ మీడియాలో, సినిమా వర్గాల్లో మరో వార్త హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే బాహుబళి కథ గురించి…
ఇదీ కథ…
క్రీ.పూ. 540వ సంవత్సరంలో మహిష్మతి రాజ్యాన్ని ఓ రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు అమరేంద్ర బాహుబలి (ప్రభాస్), భల్లాలదేవ (రానా), ఓ కుమార్తె శివగామి (రమ్యకృష్ణ). అనంతరం ఆ రాజు మహిష్మతి రాజ్యానికి అమరేంద్ర బాహుబలిని అధిపతి చేస్తాడు. ఆయన భార్య దేవసేన (అనుష్క).
వారి పాలనలో ప్రజలు సుఖశాంతులతో కాలం గడుపుతూ ఉంటారు. స్వార్థ పరుడైన మంత్రి బిజ్జలదేవ (నాజర్), బాహుబలి సోదరుడు భల్లాలదేవ కలిసి అమరేంద్ర బాహుబలిని చంపి రాజ్యాన్ని తమ ఆధీననంలోకి తెచ్చుకుంటారు. రాజ్యం తమ అధీనంలోకి వచ్చాక తన విగ్రహాన్ని ప్రతిష్టించుకుంటాడు భల్లాలదేవ. అంతే కాదు ప్రజలను తమ బానిసలుగా చూస్తాడు. పసివాడైన బాహుబలి కుమారుడుని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు భల్లాలదేవ. అయితే దేవసేన తన కుమారుడిని కాపాడి రాజ్యం దాటిస్తుంది. అనంతరం భల్లాలదేవ సైన్యం దేవసేనను బంధిస్తారు.
మరోవైపు బాహుబలి కుమారుడిని కొందరు గ్రామస్తులు కాపాడి.. పెంచి పెద్దచేసి అతనికి శివుడు (ప్రభాస్) అని పేరు పెడతారు. తన తండ్రి పోలికలతోనే ఉండే శివుడు అందర్నీ తన ధైర్య సాహసాలతో ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో తన ప్రాంతానికి రాజకుమారి అవంతిక (తమన్నా) వస్తుంది. ఆమె అందం చూసి శివుడు తనని ప్రేమిస్తాడు.
ఆ తర్వాత శివుడు అవంతికని వెతుక్కుంటూ మహిష్మతి రాజ్యానికి వెళ్తాడు. అక్కడ శివుడు తన గతం గురించి తెలుసుకొని క్రూరుడైన భల్లాలదేవపై ప్రతీకారం తీర్చుకొని రాజ్యాన్ని, ప్రజలను, తన తల్లిని ఎలా సొంతం చేసుకొన్నాడు అనేదే “బాహుబలి” చిత్ర కథ. ఈ కథ ఇప్పుడు సోషల్ నెట్ వర్క్స్‌లో హల్ చల్ చేస్తోంది.
అయితే ఇది నిజమా కాదా అన్నది జులై 10 వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఈ కథ నిజం అయినా కూడా రాజమౌళి చిత్రీకరణ అద్భుతంగా కాబట్టి దీనిపై అంచనాలు ఇంకా పెరుగుతున్నాయి.
