Tuesday, May 14, 2024
- Advertisement -

బెంగాల్ టైగర్ రివ్యూ

- Advertisement -

పవన్ కళ్యాణ్ దగ్గర దాదాపు రెండు సంవత్సరాలు నిరీక్షించి లాభం లేదు అనుకుని పక్కకి వచ్చి రవితేజ తో సినిమా తీసాడు సంపత్ నంది. గబ్బర్ సింగ్ 2 కథ కాకుండా కొత్త కథ ని రవితో తీసిన సంపత్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. రవితేజ మార్క్ యాక్షన్ కామెడీ ఉంటాయి అంటూ చాలా కన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు సంపత్ కూడా. ఈ సినిమా విషయంలో తమన్నా – రాశీ అందాలు కూడా అడిషనల్ ఆస్తులు అని చెప్పాలి. ఇంతకీ సినిమా ఎలా ఉందొ చూద్దాం 

కథ  – కథనం – పాజిటివ్ లు :

ఆకాష్ నారాయణ్(రవితేజ). కంప్యూటర్స్ లో మాస్టర్స్ చేసినా ఏ పనీ చేయకుండా తన ప్రెండ్స్ తో కలిసి జులాయిలా తిరుగుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఆకాష్ పెళ్లి చూపులకు వెళితే అక్కడ పెళ్లి కూతురైన అక్ష తను చేసుకోబోయేవాడు ఫేమస్ అయ్యుండాలని, ఇలా జులాయిలా తిరిగేవాణ్ణి చేసుకోనని చెప్పి ఆకాష్ ని అవమానిస్తుంది. ఆకాష్ చాలా కోపం వచ్చి ఎలా అయిన ఫేమస్ కావాలి అని అలోచించి అక్కడ జరుగుతున్న పొలిటికల్ పార్టీ మీటింగ్ ని నాశనం చేస్తాడు దాంతో ఆకాష్ చాలా ఫేమస్ అవుతాడు. ఆకాష్ టాలెంట్ నచ్చిన హోం మినిస్టర్  నాగప్ప(రావు రమేష్) తన కుమర్తె శ్రద్ధ(రాశీ) కు బాడీ గార్డ్ గా పెడతాడు. 

ఆకాష్ చూసిన వేంటనే బాగా నచ్చుతాడు శ్రద్ధకు. దాంతో శ్రద్ధ ఆకాష్ ప్రేమలో పడిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న నాగప్ప ఇద్దరికి పెళ్లి చేయడానికి చూస్తాడు. కానీ ఆకాష్ పెళ్లికి ఓప్పుకోడు. తను సిఎం అశోక్ గజపతి(బొమన్ ఇరానీ) కుమార్తె మీర(తమన్నా)ని ప్రేమిస్తున్నానని గట్టిగా చెప్పుతాడు. ఐతే అసలు పరిచయం లేని మీర పేరు ఎందుకు చెప్పాడు. అసలు సిఎం అశోక్ గజపతికి ఆకాష్ కి ఏం సంబధం? కేవలం ఫేమస్ అవ్వడానికే అలా చెప్పాడా? లేక అలా చెప్పడం వెనుక ఏదన్నా గతం ఉందా? అనేదే మాత్రం సినిమా చూసి తెలుసుకోవల్సిందే.

ఈ సినిమా కి మెయిన్ అట్రాక్షన్ గా రవితేజ నిలుస్తాడు. ఇన్ని సినిమాల తరవాత కూడా తన పెర్ఫార్మెన్స్ లో కొంచెం కూడా ఎనర్జీ తగ్గించుకోకుండా సాగుతున్నాడు రవితేజ. రవితేజ పాత్ర ని డీల్ చేసిన విధానం బాగా కుదిరింది. 

ఇంకా కామెడీ ఎలిమెంట్ ల విషయంలో ఖచ్చితంగా పృధ్వీ కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఎం ఎస్ నారాయణ లాంటి సీనియర్ నటుడ్ని కోల్పోయిన పరిశ్రమ కి మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తూ డిఫరెంట్ క్యారెక్టర్ లు చేస్తున్నాడు పృధ్వీ. ఈ సినిమాలో కూడా విభిన్న పాత్రలతో ఆదరకోట్టాడు. తమన్నా – రాశీ ల అందాలు మంచి పాజిటివ్ లు గా నిలిచాయి సినిమాకి. ఫస్ట్ హాఫ్ కామెడీ చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ లో వచ్చే ట్విస్ట్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యింది ఆ దెబ్బతో ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు సినిమా సూపర్ హిట్ అవ్వడానికి అనే రేంజ్ లో సాగింది. 

 

నెగెటివ్ లు :

ఈ సినిమా కి ఫస్ట్ హాఫ్ ఊపిరి పోసిన సంపత్ సెకండ్ హాఫ్ ని చాలా స్లో చేసేసాడు. అదిరిపోయే ట్విస్ట్ తో ఇంటర్వెల్ ని ముగించి సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూసేలా చేసిన సంపత్ సెకండ్ హాఫ్ కాసేపటికే చిరాకు తెప్పించాడు. పోసాని చేసిన కొన్ని స్పూఫ్ లు అసలు చిరాకు తెప్పించాయి. 

బ్రహ్మానందం ని పూర్తిగా వేస్ట్ చేసేసాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో చాలా చోట్ల దీర్ఘంగా సాగదీసి పెట్టారు. ఫైట్ ల విషయంలో కూడా చాలా నెగెటివ్ లు ఉన్నాయి. మొదటి భాగం లో కొన్ని సీన్ లకి రెండవ భాగం లో వచ్చే కొన్ని సన్నివేశాలకీ లంకె కుదరక ప్రేక్షకుడు కాస్త కన్ఫ్యూషన్ పడతాడు. చాలా చోట్ల లాజిక్ పూర్తిగా తప్పింది. క్లైమాక్స్ సినిమా మొత్తానికే పెద్ద మైనస్ పాయింట్. చాలా చోట్ల డాన్ శీను సినిమా గుర్తొస్తుంది 

 

మొత్తంగా :

మాస్ పల్స్ బాగానే తెలిసిన సంపత్ నంది , మాస్ ప్రేక్షకులకి విందు భోజనం పెట్టాడు. ఎలేవేషన్ లు కానీ సినిమాని డీల్ చేసిన విధానం కానీ పూర్తిగా మాస్ జనాల కోసమే అన్నట్టు ఉంది. క్లాస్ – యూత్ ఈ సినిమా వైపు పెద్దగా ఆకర్షితులు అవ్వరు అని అనిపిస్తుంది. పృధ్వీ కామెడీ , రవితేజ యాక్షన్ , తమన్నా అందాల కోసం ఖచ్చితంగా ఒక్కసారి చూడదగ్గ సినిమా. కమర్షియల్ గా బాగానే వెళుతుంది. సెకండ్ హాఫ్ కాస్త జాగ్రత్త తీసుకుని ఉండి ఉంటే పక్కగా కిక్ సినిమా ని మించే హిట్ రవితేజ కి దక్కి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సంపత్ నంది కి డైరెక్టర్ గా పరవాలేదు అని ఫ్యూచర్ కనుచూపు మేరలో కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -